భారత్‌లో త్వరలో మూడో వ్యాక్సిన్‌కు ఆమోదం : డాక్టర్ రెడ్డీస్
న్యూఢిల్లీ : రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రానున్న కొద్ది రోజుల్లో ఇండియన్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందనున్నదని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఆశిస్తున్నది.

న్యూఢిల్లీ : రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రానున్న కొద్ది రోజుల్లో ఇండియన్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందనున్నదని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఆశిస్తున్నది. ‘భారతదేశంలో టీకా ప్రయాణం.. కొవిడ్ -19 సెకండ్ వేవ్’ పై తెలంగాణలోని ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) వెబ్‌నార్ నిర్వహించింది.
ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈఓ దీపక్ సప్రా మాట్లాడుతూ.. ‘రాబోయే కొద్ది రోజుల్లోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఆమోదం పొందుతుందని భావిస్తున్నాం. ఇది రెండు-మోతాదుల వ్యాక్సిన్. మొదటి మోతాదు తీసుకున్న 21 వ రోజు తర్వాత రెండో డోసు తీసుకుంటారు. గరిష్ట రోగనిరోధక శక్తి 28 వ రోజు నుంచి 42 వ రోజు మధ్య అభివృద్ధి చెందుతుంది. రానున్న కొన్ని రోజుల్లోనే అనుమతి లభిస్తుందనుకుంటున్నాం’ అని చెప్పారు.
ఫార్మా మేజర్ అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్.. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) తో కలిసి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను తీసుకువచ్చింది. టీకా పరీక్షలు రష్యా, భారతదేశం, యూఏఈ, ఇతర దేశాలలో జరిగాయి. ఈ కొవిడ్ -19 వ్యాక్సిన్ 91.6 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ట్రయల్స్ డాటా ప్రస్తుతం ఇండియన్ రెగ్యులేటర్ వద్ద ఉన్నది. రాబోయే కొద్ది వారాల్లో దీనికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని సంస్థ భావిస్తున్నది.
‘భారతదేశంలో కూడా టీకా పరీక్షలు నిర్వహించాం. భారతీయ జనాభాపై టీకా భద్రతతో పాటు ఇమ్యునోజెనిసిటీ కోసం కూడా పరిశీలించాం. ఈ డాటా ప్రస్తుతం భారత రెగ్యులేటర్ వద్ద ఉన్నది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ ఆమోదించబడుతుంది’ అని దీపక్ సప్రా చెప్పారు.
కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అన్ని వయసుల వారికి సమానంగా ప్రభావవంతంగా నిరూపించబడిందని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయ పరిశోధనా సంస్థ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నాలుగు నుంచి ఆరు వ్యాక్సిన్లలో స్పుత్నిక్ వీ లక్షణాల పరంగా మొదటి స్థానంలో ఉన్నదని గింట్స్‌బర్గ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్
తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్ హోలీ సందేశం
చైనాలో చిక్కుకున్న ‘ఎవర్ గివెన్’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్
అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్’
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

