వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్
మాస్కో : కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.

మాస్కో : కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రష్యాకు చెందిన రోసియా 1 టీవీ ఛానల్ ద్వారా వెల్లడించారు. ఈ వార్తను ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్థ నివేదించింది.
పుతిన్ గత మంగళవారం టీకా తొలి డోసు అందుకున్నారు. ‘టీకా తీసుకున్న మరుసటి రోజు ఉదయం మేల్కొన్న తర్వాత కండరాల నొప్పి కొంచెం ఉన్నట్లు అనిపించింది. థర్మామీటర్ తీసుకుని చూడగా శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉన్నది’ అని ఆయన చెప్పారు. ఇంజెక్షన్ చేసిన స్థలంలో తనకు అసౌకర్య భావన కూడా ఉన్నదన్నారు.
అయితే, అనుమతించిన మూడు రష్యన్ వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నదీ పుతిన్ వెల్లడించలేదు. ఈ విషయం ఒక్క టీకా వేసిన వైద్యుడికి మాత్రమే తెలుసు.
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పొందే పుతిన్ నిర్ణయాన్ని క్రెమ్లిన్ డిసెంబరులో ప్రకటించింది. అందుబాటులో ఉన్న మూడు రష్యన్ టీకాలు మంచి ఫలితాలనిస్తున్నాయని, విస్తృతంగా అందుబాటులో ఉన్న స్పుత్నిక్ వీ దాదాపు సమానమని పుతిన్ చెప్పారు.
మార్చి 1 నాటికి స్వతంత్ర పోల్స్టర్ లెవాడా సెంటర్ ప్రకారం, దాదాపు మూడింట రెండొంతుల మంది రష్యన్లు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదు. చాలా మంది దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తీసుకోవడానికి వెనుకంజ వేయడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
కరోనావైరస్కు వ్యతిరేకంగా రష్యా తన టీకా ప్రచారాన్ని డిసెంబర్లో ప్రారంభించింది. 144 మిలియన్ల మంది రష్యన్లలో 4.3 మిలియన్ల మందికి ఇప్పటివరకు రెండు మోతాదుల టీకా అందినట్లు పుతిన్ గత సోమవారం చెప్పారు.
రష్యాలో ఇప్పటివరకు 4.5 మిలియన్లకు పైగా మందికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. వేసవి చివరి నాటికి మహమ్మారికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు పుతిన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్ హోలీ సందేశం
చైనాలో చిక్కుకున్న ‘ఎవర్ గివెన్’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్
అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్’
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

