e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు

చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు

చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు

చైనా షాంకి ప్రావిన్స్ రాజధాని, అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సొంతూరు జియాన్ నగరంలో చారిత్రాత్మక టెర్రకోట ఆర్మీ కనువిందు చేస్తున్నది. టెర్రకోటతో తయారుచేసిన 8,000 మంది సైనికులు 2,000 సంవత్సరాలుగా తమ రాజు సమాధికి కాపలా కాస్తున్నారు.

ఇది చదవడానికి కొంచెం వింతగా అనిపించినా.. ఇది నిజమని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా టెర్రకోట ఆర్మీ అని పిలుస్తారు. ఇది షాంకి వెళ్ళేవారికి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.

1974 మార్చి 29 న షాంకి రైతులు బావి తవ్వుతుండగా.. ఈ టెర్రకోట సైన్యం బయటపడింది. ఒకటిన్నర కిలోమీటర్ల వ్యాసార్థంలో తవ్వకం జరుపగా.. వరుసకు 8 మంది చొప్పున సైనికులు 11 వరుసల్లో నిలబడి.. ఫుట్‌బాల్ మైదానానికి సమానమైన హాలులో ఉంటారు.

ఈ సైనికులకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సైనికుడి ఎత్తు భిన్నంగా ఉంటుంది. ఇది వారి ముఖం, దుస్తులలో కూడా ప్రతిబింబిస్తుంది. పాలకుడు మరణించినప్పుడు ఈజిప్టులో పిరమిడ్లు నిర్మించినట్లే, చైనా పాలకుడి సమాధిని రక్షించడానికి సైనికులను జియాన్‌ నగరంలో మోహరించారు.

ఈ సైనికులను క్రీ.పూ 210-209లో చైనా రాజు క్విన్ షి హువాంగ్ మరణం తరువాత పగుళ్లు ఉన్న నేల నుంచి మట్టిని తీసి తయారు చేసినట్లు చరిత్ర చెప్తున్నది. మరణం తరువాత కూడా రాజును ఈ సైనికులు రక్షిస్తారనేది ఆ రోజుల్లో నమ్మేవారు. ఈ సైన్యం జీవిత-పరిమాణ బొమ్మల తల, చేతులు. కాళ్ళు విడిగా తయారు చేసి తరువాత జోడించినట్లుగా చరిత్రకారులు గుర్తించారు. ఈ బొమ్మలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.

రాజు సమాధి ముందున్న పెద్ద హాల్‌లో ఈ సైనికులు నిలబడి ఉన్నారు. సైనికులు వారి గుర్రాలు, కార్యాలయాలు, ఇతరులకు కూడా నివాసంగా ఉన్నది. సైనిక పరికరాలు రాగి, టిన్, వివిధ లోహాలతో తయారుచేసేవారు.

ఈ సైన్యం 23 అడుగుల లోతులో నాలుగు గుంటలలో ఉన్నది. మొదటి గొయ్యి, 230 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 6,000 బొమ్మలు ఉన్నాయి. 3–3 మీటర్ల వెడల్పు గల 11 కారిడార్లు ఉన్నాయి. చెక్కతో చేసిన పైకప్పును వర్షం నుంచి మట్టిని రక్షించడానికి ప్రత్యేక చర్యలతో ప్లాస్టర్ చేయబడింది.

సందర్శించిన మోదీ..

చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు

2015 మే నెలలో జీ జిన్‌పింగ్ పిలుపు ఆహ్వానం మేరకు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంక్‌ను సందర్శించారు. ఆ సమయంలో మోదీ టెర్రకోట సైన్యాన్ని కూడా చూశాడు. 1987 లో ఈ టెర్రకోట సైన్యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.

తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేసిన ఎన్టీఆర్

చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు

తెలుగువారి ‘ఆత్మగౌరవ’ నినాదంతో ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు 1982 లో సరిగ్గా ఇదే రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారు. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హేళన మాటలకు ఎన్టీఆర్‌ గట్టి జవాబు చెప్పారు.

1999 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 30 సీట్లలో ఘన విజయం సాధించి తానేంటో ఢిల్లీ పెద్దలకు చెప్పకనే చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్‌ను స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వీపీ సింగ్‌ను ప్రధానిగా చేశారు. నేషనల్ ఫ్రంట్‌కు చైర్మెన్‌గా కూడా వ్యవహరించారు.

1994 లో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 1995 లో అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు.. రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచి పేదల గుండెల్లో గూడుకట్టుకున్నారు ఎన్టీఆర్‌.

మరికొన్ని ముఖ్య సంఘటనలు :

2011: భారతదేశం-పాకిస్తాన్ మధ్య టెర్రర్ హాట్‌లైన ప్రారంభం

2010: మాస్కో మెట్రో టెన్‌లో రెండు ఆత్మాహుతి దాడులు, 40 మంది దుర్మరణం

2008: మొదటిసారిగా ఇంధన ఆదా కోసం ఎర్త్ అవర్ జరుపుకున్న ప్రపంచంలోని 370 నగరాలు

2004: కార్యాలయాల్లో ధూమపానాన్ని నిషేధించిన మొదటి దేశంగా నిలిచిన ఐర్లాండ్

1999: మొదటిసారి 10,000 మార్కును దాటిన యూఎస్ స్టాక్ ఇండెక్స్ డౌ జోన్స్

1981: మొదటి లండన్ మారథాన్‌ను గెలుచుకున్న నార్వేజియన్ ఇజ్ సిమోన్సెన్

1967: అణు జలాంతర్గామిని తొలిసారిగా ప్రయోగించిన ఫ్రాన్స్

1954: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభం

1943: బర్హంపూర్ జైలులో స్వాతంత్ర్య సమరయోధుడు లక్ష్మణ్ నాయక్ ఉరితీత

1901: ఆస్ట్రేలియాలో మొదటిసారి జరిగిన ఫెడరల్ ఎన్నికలు

1798: రిపబ్లిక్‌గా మారిన స్విట్జర్లాండ్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement