IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రంలోనే అకట్టుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన ఈ యువకెరటం ఏమాత్రం బెరుకు లేకుండా ఆడాడు. తొలి బంతినే సిక్సర్‌గా మలిచి దమ్మున్న కుర్రాడని ప్రశంసలు అందుకున్నాడు. దాంతో, ఈ 14 ఏళ్ల సంచలనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బొద్దుగా ఉండే వైభవ్ గురించి అతడి కోచ్ మనీష్ ఓఝా(Manish Ojha) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
మొదటి మ్యాచ్‌లోనూ అనుభవజ్ఞుడిలా చెలరేగి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా అలరించిన ఈ యంగ్‌స్టర్ క్రికెట్ కోసం తనకు నచ్చిన ఫుడ్‌కు దూరమయ్యాడట. ‘వైభవ్‌కు మటన్, పిజ్జాలు అంటే చాలా ఇష్టం. ఈ రెండింటిని ఎంతో ఇష్టంగా తినేవాడు. మటన్ అయితే ఎంత వడ్డించినా చాలు అనకుండా ఆరగించేవాడు. అందుకే వైభవ్ బొద్దుగా తయారయ్యాడు. అయితే.. క్రికెటర్ అవ్వాలంటే ఫిట్‌గా ఉండాలి కదా.. కాబట్టి తన ఫేవరెట్ ఫుడ్ మానేశాడు. బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రస్తుతం కచ్చితమైన డైట్ పాటిస్తున్నాడు’ అని మనీష్ వివరించాడు.
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
— IndianPremierLeague (@IPL) April 19, 2025
దేశవాళీలో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. సంజూ శాంసన్ గాయపడడంతో.. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వైభవ్ కళాత్మక షాట్లతో అలరించాడు. బలమైన ఫుట్‌వర్క్ కలిగిన ఈ యంగ్‌స్టర్ ఆట అచ్చం టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh), వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా(Brian Lara)లను పోలి ఉంటుందని చెబుతున్నాడు కోచ్ మనీష్.
దేశవాళీలో 12 ఏళ్లకే అరంగేట్రం చేసి రికార్డు నెలకొల్పిన వైభవ్.. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ప్రకంపనలు సృష్టించాడు. దూకుడుగా ఆడగల ఈ ఓపెనర్‌ను మెగా వేలంలో రూ.1.1 కోటి పెట్టి కొన్నది రాజస్థాన్. ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ అవకాశం రాగానే రెచ్చిపోయాడీ కుర్రాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై 27 బంతుల్లోనే 34 రన్స్ కొట్టిన వైభవ్.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
— Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2025