Fire breaks out at Dhanush’s ‘Idly Kadai’ movie set | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’ సెట్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తమిళనాడులోని తేని జిల్లా, అనుప్పపట్టి గ్రామంలో ఈ చిత్రం కోసం నిర్మించిన భారీ సెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెట్లో ఉపయోగించిన చెక్క, రసాయనాలు, ఫ్లెక్సీలు, పెయింట్స్ వంటి వస్తువుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, సెట్ దాదాపు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమాదం కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.