IPL 2025 : సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ ఆరంభం అదిరినా భారీ స్కోర్ కొట్టలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో… టాపార్డర్ విఫలమైంది. సుయాశ్ శర్మ(2-26), కృనాల్ పాండ్యా(2-25)లు తిప్పేయడంతో మిడిలార్డర్ చేతులెత్తేసింది. వందలోపే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను శశాంక్ సింగ్(31 నాటౌట్), మార్కో యాన్సెన్(25)లు ఆదుకున్నారు. ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఎదుర్కొని విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఏడో వికెట్‌కు 43 రన్స్ జోడించి పంజాబ్‌కు పోరాడగలిగే స్కోర్ అందించారు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
సొంతగడ్డపై శుభారంభం లభించినా కూడా పంజాబ్ కింగ్స్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. నాలుగు ఓవర్లలోనే 42 రన్స్ చేసిన పంజాబ్‌ను రాయల్ ఛాలెంజర్స్ స్పిన్నర్లు దెబ్బకొట్టారు. పవర్ ప్లే తర్వాత చకచకా వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(), ప్రభ్‌సిమ్రన్ సింగ్(33)లు దంచారు. యశ్ దయాల్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ బౌండరీ బాదగా.. ప్రియాన్స్ 6, 4తో విజృంభించాడు. ఆ తర్వాత భువీని ఉతికేస్తూ ప్రభ్‌సిమ్రన్ మూడు ఫోర్లు సాధించి పంజాబ్ స్కోర్ 30 దాటించాడు.
Let’s defend this!💪🏻 pic.twitter.com/C5uBiPlair
— Punjab Kings (@PunjabKingsIPL) April 20, 2025
స్పిన్నర్ కృనాల్ పాండ్యాను రంగంలోకి దింపిన ఆర్సీబీ కెప్టెన్ ఈ జోడీని విడదీశాడు. తొలి వికెట్ పడినా పంజాబ్ బ్యాటర్లు జోరు తగ్గించలేదు. హేజిల్‌వుడ్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు. పవర్ ప్లేలో 62-2తో పటిష్టంగా నిలిచిన పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో శ్రేయస్ పెద్ద షాట్ ఆడగా కృనాల్ పాండ్యా పరుగెడుడూ చక్కని క్యాచ్ అందుకున్నాడు.
POV: Suyash Sharma was here 😎#RCB fans, which timber strike did you enjoy the most? ✍️#PBKS 119/6 after 15 overs.
Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/eXbO8suU8H
— IndianPremierLeague (@IPL) April 20, 2025
అంతే.. పంజాబ్ వికెట్ల పతనం మొదలైంది. టిమ్ డేవిడ్ త్రోతో నేహల్ వధేరా(5) రనౌటయ్యాడు. సుయాశ్ శర్మ 14వ ఓవర్లో ఇంగ్లిస్(29), మార్కస్ స్టోయినిస్(1)ను బౌల్డ్ చేసి పంజాబ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 114కే 6 వికెట్లు పడిన దశలో శశాంక్ సింగ్(31 నాటౌట్), మార్కో యాన్సెన్(25 నాటౌట్)లు విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఏడో వికెట్‌కు అభేద్యమైన 43 రన్స్ జోడించి పంజాబ్‌కు పోరాడగలిగే స్కోర్ అందించారు. ఆఖరి బంతికి శశాంక్ సిక్సర్ బాదడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 రన్స్ కొట్టింది.