AFG vs NZ : ఏకైక టెస్టు ఆడేందుకు భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్(Newzealand), అఫ్గనిస్థాన్(Afghanistan) జట్లకు నిరీక్షణ తప్పడం లేదు. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆట సాగలేదు. అలాగనీ చినకులు పడి మ్యాచ్ అగిపోలేదు. కానీ, గ్రేటర్ నోయిడాలోని స్టేడియంలో ఔట్ ఫీల్డ్ పూర్తిగా సిద్ధమవ్వలేదు. ఇంకా అక్కడక్కడ తడిగానే ఉండడంతో వరుసగా రెండో రోజు కూడా టాస్ వేయకుండానే అంపైర్లు ఆటను రద్దు చేశారు. దాంతో, మూడు రోజుల మ్యాచ్‌లో తాడేపేడో తేల్చుకోనున్నాయి.
‘సోమవారంతో పోల్చితే మంగళవారం ఔట్‌ఫీల్డ్ కాస్త మెరుగ్గానే ఉంది. కానీ, ఆటకు అనుకూలంగా ఉన్నట్టు అంపైర్లు భావించలేదు. దాంతో, వరసగా రెండో రోజు కూడా రద్దు చేయాల్సి వచ్చింది. బుధవారం అయినా ఆట సాగుతుందని ఆశిస్తున్నా’ అని ఫర్వీజ్ మహరూఫ్ వెల్లడించాడు.
Day 2 Abandoned! 😕
Day 2 of the one-off #AFGvNZ Test has officially been called off. Despite multiple efforts to dry the surface, the outfield remained unfit for play.#AfghanAtalan | #AFGvNZ | #GloriousNationVictoriousTeam pic.twitter.com/IB1GpKOZhw
— Afghanistan Cricket Board (@ACBofficials) September 10, 2024
నాలుగైదు రోజుల క్రితం నోయిడాలో భారీ వర్షాలు పడ్డాయి. దాంతో, స్టేడియం మొత్తం తడిసిముద్దైంది. ఔట్ ఫీల్డ్ పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. సెప్టెంబర్ 8, ఆదివారం నుంచే గ్రౌండ్ సిబ్బంది నీటిని తోడేసే పని చేపట్టారు. అందువల్ల షెడ్యూల్ ప్రకారం సోమవారం మ్యాజ్ జరగాలి. వాన లేకపోవడంతో ఆలస్యంగానైనా మ్యాచ్ సాగుతుందని న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ ఆటగాళ్లు అనుకున్నారు.
@BCCI should be ashamed of such a pitch, besides no rain and the ground is still wet for two days, is it Mia khalifa or navida ground that became wetter and wetter, no facilities for ground staff to clear the ground pic.twitter.com/rAiIvl9fsp
— Sardar Rauf (@SR100o) September 10, 2024
కానీ, ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు మైదాన సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో, అంపైర్లు టాస్ వేయకుండానే తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక రెండో రోజూ అదే పరిస్థితి. ఔట్ ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు సిబ్బంది సూపర్ సాపర్స్, టేబుల్ ఫ్యాన్లు ఉపయోగించినా లాభం లేకపోయింది.
తాలిబాన్ల రాజ్యం ఏర్పడ్డాక అఫ్గనిస్థాన్‌లో క్రికెట్‌కు ప్రోత్సాహం కరువైంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహిణకు అనువైన స్టేడియాలు అఫ్గన్‌లో లేవు. అందుకనే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగాల్సిన ఏకైక టెస్టు కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐ (BCCI)ని ఆశ్రయించింది. అందుకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. దాంతో, కివీస్, అఫ్గన్ జట్లు టెస్టు సమరం కోసం గ్రేటర్ నోయిడా చేరుకున్నాయి.