Vietnam | వియత్నాం (Vietnam)ను టైఫూన్ యాగి (Typhoon Yagi) వణికించింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తు కారణంగా వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య తాజాగా 82కి చేరినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. వేల సంఖ్యలో ప్రజలు సహాయం కోసం ఎదరుచూస్తున్నట్లు చెప్పారు. ఉత్తర వియత్నాంలో అనేక నదుల నీటి మట్టాలు ప్రమాదకరంగా పెరిగాయి.
టైఫూన్ యాగి.. ఈ ఏడాది ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్‌గా రికార్డుకెక్కింది. శనివారం ఆ తుఫాన్ వియత్నంలోకి ఎంటర్ అయ్యింది. సుమారు 203 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ కాస్త అల్పపీడనంగా మారినా.. వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. యెన్ బాయి ప్రావిన్సులో మూడు ఫీట్ల ఎత్తును నీరు ప్రవహిస్తున్నది. వియత్నాం తీరు ప్రాంత ప్రజలను సుమారు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 ప్రావిన్సుల్లో స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు.
మరోవైపు ఉత్తర వియత్నాంలో ఉన్న ఓ బిజీ బ్రిడ్జ్ .. ఆ తుఫాన్ ధాటికి కూలిపోయింది. ఉత్తర ప్రావిన్స్ ఫూ తూ (Phu Tho) లోని ఎరుపు నదిపై (Red River) ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది (bridge collapse). ఆ సమయంలో బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పది మందికిపైగా గల్లంతైనట్లు వియత్నాం మీడియా నివేదించింది.
ఫూ తూ ప్రావిన్సులో ఉన్న ఆ బ్రిడ్జ్‌ను ఫాంగ్ చావు బ్రిడ్జ్‌గా పిలుస్తారు. దాదాపు 375 మీటర్ల పొడుగు ఉన్న ఆ బ్రిడ్జ్‌లో ఇంకా కొంత భాగం అలాగే ఉన్నది. బ్రిడ్జ్‌ను వీలైనంత త్వరగా నిర్మించాలని ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని హో తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ నదిపై ఉన్న పలు వంతెనలపై రాకపోకలపై పరిమితి విధించారు. నదిలోకి బ్రిడ్జి కూలుతున్న షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read..
bridge collapse | వియత్నాంలో టైఫూన్ యాగి బీభత్సం.. నదిలో కూలిన బ్రిడ్జ్.. షాకింగ్ వీడియో
Manipur | మణిపూర్‌లో మళ్లీ కర్ఫ్యూ.. ఇంటర్నెట్ సేవలు బంద్
Narayana Murthy | కోచింగ్ సెంటర్లపై నమ్మకం లేదు.. అలాంటి వారికే అవి అవసరం : నారాయణ మూర్తి