పారిస్, జనవరి 1: పిల్లల్లో సోషల్‌మీడియా వాడకాన్ని నిషేధించిన ఆస్ట్రేలియా బాటలో నడిచేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది. అండర్-15 పిల్లల్లో ఫేస్బుక్, స్నాప్‌చాట్, యూట్యూబ్..సహా పలు వేదికలను నిషేధిస్తూ మేక్రాన్ ప్రభుత్వం కొత్త బిల్లును సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ బిల్లుపై ఆ దేశ చట్టసభ సభ్యులు సమీక్ష నిర్వహిస్తున్నారు. బిల్లును జనవరి 19న ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 15ఏండ్లలోపు పిల్లలు స్కూల్‌కు స్మార్ట్ఫోన్లు తీసుకురాకుండా, సోషల్ మీడియా ఉపయోగించకుండా మేక్రాన్ ప్రభుత్వం సరొకొత్త నిబంధనావళిని తీసుకురావాలని భావిస్తున్నది. దీనిని 2026 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రవేశపెట్టాలని మేక్రాన్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది.