ICC : ప్రతిష్ఠాత్మక ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మే నెలకు గానూ మహిళల, పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచిన క్రికెటర్ల పేర్లను శనివారం వెల్లడించింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ చ్లొయె ట్రయాన్ (Chloe Tryon)ను పురస్కారం వరించింది. శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్‌లో బ్యాటుతో, బంతితో అదరగొట్టిన ట్రయాన్ ఎక్కువ ఓట్లతో ఈ అవార్డుకు ఎంపికైంది. పురుషుల విభాగానికొస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కెప్టెన్ మహమ్మద్ వసీం(Muhammad Waseem) విజేతగా అవతరించాడు.
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ట్రయాన్తో పాటు భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్‌లు పోటీ పడ్డారు. , ముక్కోణపు సిరీస్‌లో ప్రదర్శనకు ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో, 31 ఏళ్ ట్రయాన్ విజేతగా నిలిచింది. కానీ, భారత్‌పై 43 బంతుల్లోనే 67 చేసిన ఈ ఆల్‌రౌండర్ .. మంధాన వికెట్ పడగొట్టింది. ఇక శ్రీలంకపై అయితే రెచ్చిపోయిన తను 5 సిక్సర్లతో 74 రన్స్ చేసింది. అనంతరం బంతితోనూ తిప్పేస్తూ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తను 5-34 గణాంకాలు నమోదు చేసింది.
Dazzling Proteas all-rounder Chloe Tryon is the ICC Women’s Player of the Month for May 2025 after impressing in the tri-series in Sri Lanka 👏
Read more ➡️ https://t.co/15atkJCgfo pic.twitter.com/fn5ml0fH1L
— ICC (@ICC) June 7, 2025
టీ20ల్లో విధ్వంసక బ్యాటర్‌గా ఎదుగుతున్న యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం బంగ్లాదేశ్ సిరీస్‌లో దంచేశాడు. వరుసగా రెండు అర్థ శతకాలు సాధించాడు. ఆ ప్రదర్శనకు గుర్తింపుగా అతడు రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. నిరుడు ఏప్రిల్‌లో ఈ చిచ్చరపిడుగు ఐసీసీ నుంచి ఈ పురస్కారం స్వీకరించాడు.
UAE skipper Muhammad Waseem gets his hands on the ICC Men’s Player of the Month for the second time 🔥
Read more ➡️ https://t.co/71F7YWthqK pic.twitter.com/hu2tEyA0Zc
— ICC (@ICC) June 7, 2025
ఈసారి స్కాంట్లాండ్ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్, యూఎస్ఏ ప్లేయర్ మిలింద్ కుమార్‌లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఐసీసీ, అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా. మా జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని వసీం తెలిపాడు.