Tim Southee : న్యూజిలాండ్ జట్టు ఈమధ్యే టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ (Tim Southee) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. స్వదేశంలో అది కూడా సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేస్తానని సౌథీ వెల్లడించాడు. డిసెంబర్లో ఇంగ్లండ్‌తో జరుగుబోయే టెస్టు సిరీస్ తనకు చివరిదని ఈ వెటరన్ పేసర్ తెలిపాడు. ఈ విషయాన్ని శుక్రవారం అతడు అభిమానులకు తెలియజేశాడు.
‘న్యూజిలాండ్ జట్టుకు ఆడాలని నేను చిన్నప్పటి నుంచి కల కన్నాను. 18 ఏండ్లుగా బ్లాక్ క్యాప్స్‌కు ప్రాతినిధ్యం వహించడం నిజంగా గొప్ప గౌరవం. అయితే.. నాకు ఎంతో ఇచ్చిన ఆటకు వీడ్కోలు పలకాలసిన సమయం వచ్చేసింది. టెస్టు క్రికెట్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది.
“Fulfilling a childhood dream”
From a farm in Northland to the world stage! Hear from Tim Southee about his decision to retire from Test cricket after the upcoming Test series against England. Read more | https://t.co/L6IuX3jCea #NZvENG pic.twitter.com/93tdLszJky
— BLACKCAPS (@BLACKCAPS) November 15, 2024
కొన్నేండ్ల క్రితం ఏ ప్రత్యర్థితో నా కెరీర్ మొదలు పెట్టానో ఇప్పుడు అదే జట్టుపై ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నా. మరోవిషయం ఏంటంటే.. ఆ మూడు మైదానాలు నాకు చాలా స్పెషల్. బ్లాక్ క్యాప్ ప్లేయర్‌గా కెరీర్ ముగించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఉండదేమో అనిపిస్తోంది’ అని సౌథీ వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన సౌథీ.. టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్. ఈ పొడగరి పేసర్ 104 మ్యాచుల్లో 385 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రపంచ క్రికెట్లో మూడొందల టెస్టు వికెట్లు, వన్డేల్లో 200 వికెట్లు, టెస్టుల్లో 100 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ సౌథీనే కావడం విశేషం.
Will Tim Southee reach the 400-wicket milestone in his final Test series? pic.twitter.com/USOPYqg5QX
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2024
టెస్టులకు గుడ్ బై చెబుతున్న సౌథీ ఇకపై కౌంటీల్లో మాత్రమే ఆడనున్నాడు. ఒకవేళ కివీస్ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే సౌథీ మళ్లీ జట్టులోకి వచ్చే వీలుంది.