Mercedes-Benz | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ – బెంజ్ (Mercedes-Benz) కార్లు పిరం కానున్నాయి. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి అన్ని మోడల్ కార్ల ధరలు రూ.మూడు శాతం వరకూ పెరుగుతాయని మెర్సిడెజ్ బెంజ్ ప్రకటించింది. ఇన్ పుట్ కాస్ట్స్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక ఆపరేషనల్ ఖర్చులు పెరిగిపోవడం వల్లే కార్ల ధరలు పెంచక తప్పడం లేదని మెర్సిడెజ్ బెంజ్ పేర్కొంది. దీని ప్రకారం మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ (GLC) పై రూ.2 లక్షలు, టాప్ హై ఎండ్ మెర్సిడెజ్ – మే బ్యాచ్ ఎస్ 680 లగ్జరీ లిమౌసిన్ (Mercedes-Maybach S 680 luxury limousine) ధర రూ. 9 లక్షలు పెరుగుతుందని ఓ ప్రకటనలో మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది.
గత తొమ్మిది నెలలుగా పెరిగిపోయిన ఇన్ పుట్ కాస్ట్, హయ్యర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ను ఆపరేషనల్ ఖర్చులో కలిపేస్తున్నామని పేర్కొంది. మెటీరియల్ కాస్ట్ పెరగడం, కమొడిటీ ధరల్లో ఒడిదొడుకులు, లాజిస్టిక్ ఖర్చుల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఖర్చు గత మూడు త్రైమాసికాలుగా పెరుగుతున్నదని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకూ ప్రస్తుత ధరలపై బుకింగ్స్ కు పాత ధరలు వర్తిస్తాయన్నారు.