Airlines regulations | విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసేవారికి కేంద్రం హెచ్చరిక.. వీడియో బ్లాగర్లకు కూడా
Airlines regulations : విమానంలో ప్రయాణించేవారికి కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Airlines regulations : విమానంలో ప్రయాణించేవారికి కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విమానంలో నిబంధనలు పాటించని ప్రయాణికులపై తీసుకునే చర్యలపై పార్లమెంట్లో నమక్కల్ ఎంపీ వీఎస్ మాతేశ్వరన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిచ్చారు. ఈ అంశంలో డీజీసీఏ ఇప్పటికే 1937, ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ రూపొందించిందన్నారు.
విమానంలో ప్రయాణికుల ప్రవర్తనపై నియమావళి ఉందన్నారు. దీని ప్రకారం.. విమానంలో లౌడ్ మ్యూజిక్ లేదా సౌండ్స్ ప్లే చేస్తే శిక్షించేలా ప్రత్యేక చట్టం అంటూ ఏదీ లేదన్నారు. అయితే, విమానంలో ప్రయాణికులు లేదా సిబ్బంది భద్రతకు ఇబ్బంది కలిగించే చర్యలకు లేదా వారికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా ఇలా లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి ఇబ్బంది కలిగించిన వారిపై కొన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువ శబ్దంతో ఏదైనా మ్యూజిక్, ఇతర సౌండ్ ప్లే చేయకూడదు. అనుచితంగా ప్రవర్తించే అలాంటివారి ప్రయాణాన్ని విమాన సంస్థలు రద్దు చేయవచ్చు. విమానంలోకి అనుమతించరు. విమానంలో ఇబ్బంది కలిగిస్తే విమానం నుంచి దించేయడంతోపాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ విషయంలో ప్రయాణికులు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ఫాలో కావాల్సిందే.
అయితే, విమానంలో అప్పుడప్పుడూ ప్రయాణికులకు సూచనలు ఇచ్చేముందు ఆయా సంస్థలు సాఫ్ట్ మ్యూజిక్ వంటివి ప్లే చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు మాత్రం తమ మొబైల్ డివైజెస్ లేదా ఇతర డివైజెస్ వంటివి వాడేటప్పుడు లౌడ్ మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఇయర్ ఫోన్స్ వాడాల్సిందే. ఇక విమానంలో ఫొటోలు, వీడియోలు తీసే వీడియో బ్లాగర్లకు కూడా కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయకూడదని సూచించింది. ఇందుకోసం ముందుగానే రాతపూర్వక అనుమతి తీసుకోవాలని కోరింది. విమానంలో మర్యాదపూర్వకంగా అందరూ ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ నియమాల్ని కేంద్రం అమలు చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

