Viral Video | మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్ల ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. ఎన్నికల ముందు పంచిన డబ్బులు, చీరలు, హాట్‌బాక్స్‌లు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓటర్లు ఎదురుతిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలోని ఒకటో వార్డు నుంచి స్వరూపరాణి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబసభ్యులు ఓటర్ల ఇళ్లకు వచ్చి హల్చల్ చేశారు. పంచిన డబ్బులు, చీరలు, హాట్‌బాక్స్‌లు రిటర్న్ ఇవ్వాలని ఓటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబసభ్యుల తీరుతో విసుగెత్తిపోయిన ఓటర్లు మూకుమ్మడిగా ఎదురించారు. మిమ్మల్ని ఎవరు ఇవ్వమన్నారని ఎదురు తిరిగి ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక స్వరూపరాణి, ఆమె కుటుంబసభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్
ఎదురు తిరిగిన ఓటర్లు
యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలోని ఎన్నికల్లో ఒకటవ వార్డులో ఓడిపోయినందుకు తాను పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని ఓటర్ల ఇళ్లపైకి… pic.twitter.com/ehNIw0KJ82
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2026