RCB | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ లీగ్‌లో ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠ పోరులో ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ కప్‌తో జట్టు బెంగళూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరం మొత్తం ఎరుపెక్కింది. ఎక్కడ చూసినా ఆర్సీబీ అభిమానులు జట్టు జర్సీలు ధరించి సందడి చేస్తున్నారు. వేలాది మంది అభిమానులు విధాన సౌధ (Vidhana Soudha)కు చేరుకుని ‘ఆర్సీబీ..’, ‘ఆర్సీబీ..’ నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Bengaluru: Fans of #RoyalChallengersBengaluru gather in large numbers outside Vidhana Soudha to catch a glimpse of their champion team #RoyalChallengersBengaluru team will arrive at Vidhana Soudha, where they will be felicitated by the Karnataka government… pic.twitter.com/axXtpvIU1m
— ANI (@ANI) June 4, 2025
విక్టరీ పరేడ్ రద్దు
మరోవైపు మధ్యాహ్నం జరగాల్సిన విక్టరీ పరేడ్ రద్దైన (victory parade cancelled) విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ చిన్నస్వామి స్టేడియంలో సత్కార కార్యక్రమానికి మాత్రం బెంగలూరు పోలీసులు అనుమతించారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆర్సీబీ జట్టు బెంగళూరుకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్‌కు ఆర్సీబీ యాజమాన్యం ప్లాన్ చేసింది.
#WATCH | Bengaluru: Fans of #RoyalChallengersBengaluru gather in large numbers outside Vidhana Soudha to catch a glimpse of their champion team #RoyalChallengersBengaluru team will arrive at Vidhana Soudha, where they will be felicitated by the Karnataka government… pic.twitter.com/HUVxza3FsI
— ANI (@ANI) June 4, 2025
మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధలో పరేడ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంకు చేరుకోవాల్సి ఉంది. అక్కడ సుమారు 50 వేల మంది ప్రేక్షకుల మధ్య విక్టరీ పరేడ్ సంబరాలు జరిగేలా జట్టు యాజమాన్యం ప్లాన్ చేసింది. అయితే, పోలీసులు ఈ పరేడ్‌కు అనుమతి నిరాకరించారు. విక్టరీ డే పరేడ్‌కు అనుమతి ఇవ్వలేమని బెంగళూరు పోలీసులు ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. నగరంలో భారీ ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
#WATCH | Bengaluru, Karnataka | People celebrate and cheer for #IPL2025Champions #RoyalChallengersBengaluru outside the M Chinnaswamy Stadium. #RoyalChallengersBengaluru clinched their first #IPL trophy yesterday after defeating Punjab Kings. pic.twitter.com/r1lKOKnYkz
— ANI (@ANI) June 4, 2025
అంతేకాదు చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశాన్ని కూడా పరిమితం చేశారు. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియంలో పరిమిత పార్కింగ్ స్థలం మాత్రమే ఉందని.. అభిమానులు మెట్రో, ఇతర ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నగర వాసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సీబీడీ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. ఆ మార్గంలో రాకపోలకు సాగించొద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.
#WATCH | Bengaluru: Fans of #RoyalChallengersBengaluru gather in large numbers outside Vidhana Soudha to catch a glimpse of their champion team
#RoyalChallengersBengaluru team will arrive at Vidhana Soudha, where they will be felicitated by the Karnataka government… pic.twitter.com/syP5epntYm
— ANI (@ANI) June 4, 2025
Also Read..
RCB victory parade | ఆర్సీబీకి షాక్.. విక్టరీ పరేడ్ రద్దు
DK Shiva Kumar | ఆర్సీబీ ఆటగాళ్లు రాష్ట్రం గర్వించేలా చేశారు : కర్ణాటక డిప్యూటీ సీఎం