Rishi Sunak | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ లీగ్‌లో ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠ పోరులో ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే ఫైనల్ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున ఆర్సీబీ అభిమానులు తరలివచ్చారు. ‘ఈ సాల కప్ నమదు’ అంటూ స్టేడియంలో హోరెత్తించారు. అభిమానులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అందులో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ఒకరు. ఆయన తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆర్సీబీ జట్టుకు మద్దతుగా స్టేడియంలో సందడి చేశారు. మ్యాచ్ అనంతరం బెంగళూరు జట్టు విక్టరీ సెలబ్రేషన్స్‌లో కూడా పాలుపంచుకున్నారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి సునాక్ దంపతులు ఫొటోలకు ఫోజులిచ్చారు. స్టేడియంలో ఆర్సీబీ జట్టు విక్టరీ సెలబ్రేషన్స్, విరుష్క జంటతోని ఫొటోలను రిషి సునాక్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ‘వాట్ ఏ నైట్… ఈ సాల కప్ నమదు’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
RCB victory parade | ఆర్సీబీకి షాక్.. విక్టరీ పరేడ్ రద్దు
Liquor Sales: ఆర్సీబీ ఎఫెక్ట్.. కర్నాటకలో ఒక్క రోజే 157 కోట్ల మద్యం అమ్మకాలు
DK Shiva Kumar | ఆర్సీబీ ఆటగాళ్లు రాష్ట్రం గర్వించేలా చేశారు : కర్ణాటక డిప్యూటీ సీఎం