గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 22, 2020 , 00:24:17

ఫైనల్‌లో థీమ్‌

ఫైనల్‌లో థీమ్‌

  • సెమీస్‌లో జొకోవిచ్‌పై గెలుపు 

లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను చిత్తు చేసి డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) తుదిపోరుకు చేరాడు. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ థీమ్‌ 7-5, 6-7(10/12), 7-6(7/5)తేడాతో సెర్బియా స్టార్‌ జొకోను ఓడించాడు. తొలి సెట్‌ను సునాయాసంగానే గెలిచిన మూడో ర్యాంక్‌ థీమ్‌.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయాడు. నిర్ణయాత్మక తుది సెట్‌ సైతం హోరాహోరీగా సాగగా.. టై బ్రేకర్‌లో అనూహ్యంగా పుంజుకున్న థీమ్‌ చివరికి విజయం సాధించాడు. మరో సెమీస్‌లో నాదల్‌, మద్వెదెవ్‌ తలపడనున్నారు.