The Hundred League : టీ20 ఫార్మాట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ఐపీఎల్ (IPL)ను మించిన లీగ్ ప్రపంచంలోనే లేదని చెప్పొచ్చు. మన దేశంలోనే కాదండోయ్.. విదేశాల్లోనూ సిస్టర్ ఫ్రాంచైజీలతో పొట్టి క్రికెట్‌ను శాసిస్తున్నారు ఐపీఎల్ జట్ల యజమానులు. ఈమధ్యే ఆర్థికంగా సతమతం అవుతున్న ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్ (England Club Cricket)కు ఊపిరిలూదేందుకు వీరంతా సిద్ధమయ్యారు. ‘ది హండ్రెడ్ లీగ్’ (The Hundred League)లో జట్లలో వాటాను కొనుగోలు చేసి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఐపీఎల్ జట్లు తమతో చేయి కలిపిన వేళ రూ.60 వేల కోట్ల ఆదాయంపై కన్నేశారు హండ్రెడ్ లీగ్ నిర్వాహకులు.
ఇంగ్లండ్‌లోని చిన్న చిన్న కౌంటీ క్లబ్‌లు ఆర్ధిక వనరుల కోసం ఈసీబీ మీదనే ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ది హండ్రెడ్ లీగ్‌లో జట్లలో వాటాదారుగా చేరడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల పరిధి పెరగడం అటుంచితే.. ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్ పురోగతికి ఈ ఒప్పందం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే దానిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
Top 10 Biggest Cricket Leagues (2025):
1) IPL 🇮🇳
2) ILT20 🇦🇪
3) SA20 🇿🇦
4) BBL 🇦🇺
5) The Hundred 🏴
6) MLC 🇺🇸
7) PSL 🇵🇰
8) BPL 🇧🇩
9) CPL 🏝️
10) WPL 🇮🇳~ PSL was on 2nd in 2024, but a hair dryer effect caused it to slip to 7th😅
~ BTW, which is your Favourite Cricket League🤔 pic.twitter.com/OlAODSDtR9
— Richard Kettleborough (@RichKettle07) July 2, 2025
ఎందుకంటే.. లియోనార్డ్ కర్టిస్ క్రికెట్ ఆర్ధిక నివేదిక ప్రకారం ఇంగ్లండ్‌లోని మూడు ప్రధాన క్లబ్స్‌కు.. చిన్నాచితకా క్లబ్స్ మధ్య దూరం పెరుగూతూ వస్తోంది. సర్రే, ల్యాంక్‌షైర్, వార్విక్షైర్ క్లబ్స్కే 44 శాతం ఆదాయం సమకూరుతోంది. నార్తంప్టన్‌షైర్, లీసెస్టర్‌షైర్, డెబ్రిషైర్ వంటి చిన్న క్లబ్స్ మాత్రం ఆదాయం లేక అల్లాడుతున్నాయి. ది హండ్రెడ్ లీగ్‌లో 8 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందని ఇంగ్లండ్ క్లబ్స్ ధీమాతో ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఓవల్ ఇన్విసిబుల్స్ జట్టులో 49 శాతం వాటాను దక్కించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నార్తర్న్ సూపర్ చార్జర్స్‌లో వంద శాతం వాటాను సొంతం చేసుకోగా.. సథర్న్ బ్రేవ్ జట్టులో 49 శాతం వాటాను ఢిల్లీ క్యాపిటల్స్ వశమైంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70 శాతం షేర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కొనుగులో చేసింది. మిగతా నాలుగు జట్లకు అమెరికా పెట్టుబడిదారులు అండగా నిలిచారు.
Full squads incoming 🫡 pic.twitter.com/nOK3wPv9qi
— The Hundred (@thehundred) July 11, 2025