Markandeya Mandal Puja | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లోని మార్కండేయ దేవాలయంలో శనివారం వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో (108)అష్టోత్తర-శత-కలశపూజ-అభిషేకము-యజ్ఞము-పూర్ణాహుతి-తీర్థ-ప్రసాద తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివునికి అభిషేకం నిర్వహించారు.
ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం ప్రతినిధులు చాట్ల రాజేశ్వర్, సబ్బని కృష్ణ హరి, తుమ్మ రమేష్, చౌకి దాసు, దిగంబర్, సంఘ ప్రతినిధులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.