Hockey Pro League : యూరప్ గడ్డపై భారత జట్టుకు మరో ఓటమి. ఇప్పటికే హాకీ ప్రో లీగ్ (Hockey Pro League)లో నాలుగు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా శనివారం ఆస్ట్రేలియా (Australia) చేతిలో కంగుతిన్నది. తొలిఅర్ధ భాగంలో 2 గోల్స్‌తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఆఖర్లో పట్టు సడలించింది. ప్రత్యర్థి ఆటగాళ్లు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకున్నారు. దాంతో, ఫార్వర్డ్ ప్లేయర్ అభిషేక్ రెండు గోల్స్‌తో మెరిసినప్పటికీ కంగారూల చేతిలో 2-3తో మ్యాచ్ చేజారింది.
హాకీ ప్రో లీగ్‌లో భారత జట్టును వరుస ఓటములు వెంటాడుతున్నాయి. నెదర్లాండ్స్ చేతిలో రెండుసార్లు, అర్జెంటీనాతో ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైన టీమిండియా శనివారం కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి అర్ధ భాగంలోనే ఫార్వర్డ్ అభిషేక్ 8వ నిమిషంలో, 35వ నిమిషంలో గోల్ చేయడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో, విజయం కాయం అనిపించింది.
Full-time fight. 💪🏻
Our Men in Blue showed incredible spirit, with Abhishek scoring twice, but narrowly went down 3–2 to Australia. 🇮🇳
A tough result but plenty of positives to take forward.#HockeyIndia #IndiaKaGame
.
.
.@CMO_Odisha @IndiaSports @sports_odisha @Media_SAI… pic.twitter.com/2OgZVBvFz5— Hockey India (@TheHockeyIndia) June 14, 2025
కానీ, ఆ తర్వాత పుంజుకున్న ఆసీస్ నాథన్ ఎఫ్రామ్స్ 42వ నిమిషంలో గోల్‌తో ఖాతా తెరిచింది. అనంతరం 56వ నిమిషంలో జోయెల్ రింటాలా, 60వ నిమిషంలో టామ్ క్రెయిగ్ పెనాల్టీ కార్నర్లను గోల్ పోస్ట్‌లోకి పంపారు. దాంతో, 2-3తో టీమిండియాకు ఊహించని ఓటమి ఎదురైంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత డ్రాగ్ ఫ్లికర్ జుగ్రాజ్ ఆఖరి నిమిషంలో గోల్ చేసినా హర్మన్‌ప్రీత్ సింగ్ సేనకు విజయం దక్కలేదు. కానీ, ఈసారి ఆసీస్ ఆటగాళ్లు చివరి నిమిషంలో వరుస గోల్స్ చేసి జట్టును గెలిపించడంతో భారత బృందం, అభిమానులకు షాక్‌లో ఉండిపోయారు.