మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 12, 2020 , 12:48:18

ఆస్ట్రేలియా సిరిస్‌లో కొత్త జెర్సీలో టీమిండియా

ఆస్ట్రేలియా సిరిస్‌లో కొత్త జెర్సీలో టీమిండియా

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా సిరిస్‌లో టీమిండియా కొత్త లుక్‌లో కనిపించనుంది. ఈ సిరిస్‌ నుంచి భారత క్రికెట్‌ జట్టు వడ్డే, టీ20 మ్యాచుల్లో కొత్త జెర్సీని ధరించనుంది. 90వ దశకంలో మాదిరిగా నేవీ బ్లూ రంగులో ఉండనుంది. ఇటీవల ధరించిన సాంప్రదాయ స్కై బ్లూ కలర్ మారనుంది. ముదురు నీలం రంగులో ఉన్న జెర్సీపై తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో స్ట్రిప్స్‌ ఉన్నాయి. ఇంతకు ముందు నైకీ సంస్థ భారత క్రికెటర్లకు స్పాన్సర్‌గా ఉండేది. తాజాగా ఆ సంస్థ వైదొలగడంతో ఎంపీఎల్‌ స్పోర్స్‌ ఆ స్థానంలోకి వచ్చి చేరింది. ఇప్పటికే ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థతో గత నెలలో బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. ఎంపీఎల్ భారత జట్టుకు కొత్త కిట్లను స్పాన్సర్ చేయడంతో పాటు ఆటగాళ్లకు కొత్త జెర్సీ, కొత్త కిట్లను సమకూర్చనుంది.


ఇదిలా ఉండగా.. బుధవారం భారత పర్యటన కోసం టీ20 క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు భాగంగా వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అలాగే ఆస్ట్రేలియాతో తొలిసారిగా డే/నైట్‌ టెస్టులో తలపడనుంది. మ్యాచ్‌ డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో జరుగనుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో 26-30, వచ్చే ఏడాది సిడ్నీలో జనవరి 7-11, బ్రిస్బేన్‌ జనవరి 15-19 మధ్య మ్యాచులు జరుగనున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.