INDW vs UAEW : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఆదివారం యూఏఈ(UAE)పై భారీ విజయం సాధించింది. టీ20ల్లో రికార్డు స్కోర్ కొట్టిన భారత్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66), వికెట్ కీపర్ రీచా ఘోష్(64 నాటౌట్)లు అర్ధ శతకాలతో చెలరేగారు. దాంతో, 201 రన్స్ కొట్టిన టీమిండియా ఆ తర్వాత బౌలర్ల విజృంభణతో ప్రత్యర్థిని 123 పరుగులకే కట్టి చేసింది. టీ20ల్లో అత్యధిక స్కోర్ బాదిన భారత్ రెండో విజయంతో గ్రూప్ ఏలో అగ్రస్థానాన్ని పదిలం చేసకుంది.
డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఆసియా కప్‌లో అదరగొడుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు ఆధిపత్యాన్ని చాటుతూ జయభేరి మోగిస్తోంది. ఆదివారం దంబుల్లా స్టేఇయంలో యూఏఈపై టీమిండియా భారీ విజయం నమోదు చేసింది. 202 పరుగుల ఛేదనలో యూఈఏ 123కే పరిమితమైంది. దాంతో, భారత్ 78 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. భారీ ఛేదనలో యూఏఈ ఓపెనర్, కెప్టెన్ ఇషా రజిత్ ఒజా(38) దూకుడుగా ఆడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడింది.
Renuka Thakur 🤝 Consistency with the new ball
UAE: 43/3 (8)#WomensAsiaCup2024 #ACC #HerStory #INDWvUAEW pic.twitter.com/JHNVil2Mog
— AsianCricketCouncil (@ACCMedia1) July 21, 2024
కవిష ఎగొడగే(40 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించి ఆందోళన రేపింది. అయితే.. తనూజ కన్వర్ బౌలింగ్ ఒజాను ప్టంపౌట్ చేసిన రీచా భారత శిబిరంలో ఆనందం నింపింది. ఆ తర్వాత దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు తలొక వికెట్ తీసి యూఏఈని మరింత కష్టాల్లోకి నెట్టారు. 20వ ఓవర్ ఆఖరి బంతికి రితికా రజిత్ రనౌట్ కావడంతో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.
🔙 to 🔙 wins for Team India 🇮🇳#WomensAsiaCup2024 #ACC #HerStory #INDWvUAEW pic.twitter.com/OKvsQaTS7W
— AsianCricketCouncil (@ACCMedia1) July 21, 2024
టాస్ గెలిచిన యూఈఏ కెప్టెన్ ఇషా ఒజా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(13), షఫాలీ వర్మ(37)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. కొద్ది సేపటికే దయలాన్ హేమలత(2), ఆపద్భాందవురాలి పాత్ర పోషించే జెమీమా రోడ్రిగ్స్(14) సైతం వాళ్లను అనుసరించింది.
ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకుంది. రీచా ఘోష్( 64 నాటౌట్)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 19వ ఓవర్లో కెప్టెన్ రనౌట్ అయ్యాక రీచా మరింత రెచ్చిపోయింది. వరుసగా రెండు బౌండరీలతో తొలి టీ20 ఫిఫ్టీ బాదింది. ఆ తర్వాత రెండు బంతులను కూడా రీచా బౌండరీకి పంపడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 2021 పరుగులు చేసింది.