WPL Opening Ceremony : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్ (YoYo Honey Singh) పాటలతో, అందాల నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) డాన్స్ షోతో నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం దద్ధరిల్లిపోయింది. తన హిట్ సాంగ్స్‌తో హనీ సింగ్ అభిమానులను ఉర్రూతలూగించగా.. జాక్వెలిన్ తనదైన మెస్మరైజింగ్ నృత్యంతో మరోసారి అందరి మనసులు కొల్లగొట్టింది.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో మొదలవ్వనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. టాస్ పూర్తయ్యాక మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు (Harnaz Sandhu) స్టేజి మీదకొచ్చి మహిళా శక్తిని చాటి చెప్పింది. క్రికెట్‌తో పాటు పలు రంగాల్లో అతివల కృషిని ఈ విశ్వ సుందరి కొనియాడింది.
What a way to kick things off! 🥳
Harnaaz Sandhu sets the tone at the #TATAWPL 2026 opening ceremony, enthralling fans in Navi Mumbai 💃#MIvRCB | #KhelEmotionKa pic.twitter.com/K6atioT4tK
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
Jacqueline Fernandez lit up the WPL 2026 opening ceremony 😍 pic.twitter.com/BdGZfypYyk
— InsideSport (@InsideSportIND) January 9, 2026
అనంతరం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించింది. ‘జుమ్మే కీ రాత్ హై’ వంటి హిట్ పాటలకుతన బృందంతో కలిసి హుషారుగా నర్తించిన ఈ సుందరాంగి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. గాయకుడు యోయో హనీ సింగ్ తన గాత్రంతో ఫ్యాన్స్‌ను సంగీత ఝరిలో ముంచేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లోని ‘లుంగి డాన్స్’, మరో హిట్ సాంగ్ ‘వన్స్‌మోర్’తో అభిమానులతో స్పెప్పులు వేయించాడు.
Yo Yo Honey Singh in the house… what an entry 😎#TATAWPL, #MIvRCB 👉 LIVE NOW ➡️ https://t.co/9yNrlZigBP pic.twitter.com/Ij5YePvKEU
— Star Sports (@StarSportsIndia) January 9, 2026