రామవరం, జనవరి 09 : సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల కోసం నిర్వహిస్తున్న ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్–2025 శుక్రవారం రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఎం (ఫైనాన్స్) ఎం.సుబ్బారావు, జీఎం (పర్సనల్) వెల్ఫేర్ & సీఎస్ఆర్ జి.వి.కిరణ్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. టోర్నమెంట్ కన్వీనర్‌గా ఏరియా ఎస్ఓటు జీఎం జి.వి.కోటి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జీఎం శాలెం రాజు మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిన సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బందిని అభినందించారు.
ఈ టోర్నమెంట్ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. పోటీల్లో కొత్తగూడెం, బెల్లంపల్లి, రామగుండం రీజియన్లతో పాటు కార్పొరేట్ కలిపి నాలుగు టీమ్‌లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ప్రారంభ క్రికెట్ మ్యాచ్‌లో కార్పొరేట్ టీమ్ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, కొత్తగూడెం రీజియన్ టీమ్ 164 పరుగులకే పరిమితమై 12 పరుగుల తేడాతో ఓడింది. రెండో మ్యాచ్‌లో రామగుండం రీజియన్ టీమ్, బెల్లంపల్లి రీజియన్ టీమ్ తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, క్రీడాకారులు, స్పోర్ట్స్ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

Ramavaram : కొత్తగూడెంలో సింగరేణి ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం