Dinesh Saraogi | విమానంలో మహిళకు లైంగిక వేధింపులు.. జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ సరోగీపై కేసు
Dinesh Saraogi | లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ స్టీల్ (Jindal Steel) కంపెనీ సీఈవో దినేశ్ కుమార్ సరోగీ (Dinesh Kumar Saraogi) పై కోల్‌కతా పోలీసులు (Kolkata police) ఆదివారం కేసు నమోదు చేశారు.
Dinesh Saraogi : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ స్టీల్ (Jindal Steel) కంపెనీ సీఈవో దినేశ్ కుమార్ సరోగీ (Dinesh Kumar Saraogi) పై కోల్‌కతా పోలీసులు (Kolkata police) ఆదివారం కేసు నమోదు చేశారు. దినేశ్ కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఇటీవల ఎక్స్ వేదికగా ఆరోపించారు.
‘నేను కోల్‌కతా నుంచి అబుదాబికి విమానంలో వెళ్తున్న సమయంలో దినేశ్ కుమార్ సరోగీ అనే వ్యక్తి నా పక్క సీట్లో కూర్చున్నారు. తాను జిందాల్ స్టీల్ సీఈవోనని పరిచయం చేసుకొని మాటలు కలిపారు. అనంతరం ఆయన ఫోన్లోని పోర్న్ వీడియోలు నాకు చూపిస్తూ అసభ్యంగా తాకారు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. భయంతో అక్కడి నుంచి వాష్‌రూమ్‌కి వెళ్లి ఎయిర్ స్టాఫ్‌కి ఫిర్యాదు చేశాను. వారు నన్ను తమ సీటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారు. నేను కనిసించకపోయేసరికి నా గురించి తెలుసుకోవడానికి దినేశ్.. ఎయిర్‌లైన్ సిబ్బందికి పలుమార్లు ఫోన్ చేశారు’ అని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆమె ఫిర్యాదు మేరకు అబుదాబి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం కోల్‌కతాలోని బిధాన్నగర్ సిటీ పోలీసులు కూడా దినేశ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఘటన అనంతరం బాధిత మహిళ.. ‘జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన జిందాల్.. తాను ఇలాంటి వాటిని క్షమించనని అన్నారు. దర్యాప్తు చేయాలని తమ బృందాన్ని కోరామని, నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

