రాయపోల్ : సౌత్ ఇండియా సైన్స్ఫెయిర్ ( Science Fair ) కు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రభాకర్ ( Prabhakar ) ఎంపికయ్యారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సైన్స్ ఫెయిర్ కామారెడ్డి జిల్లాలో నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉపాధ్యాయుల టీఎల్ఎం మేళా లో మ్యాథ్స్ సంబంధించిన టీఎల్ఎం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం జడ్పీహెచ్ఎస్ బేగంపేట ఉపాధ్యాయులు ప్రభాకర్ రాష్ట్రం నుంచి సౌత్ ఇండియా సైన్స్ఫెయిర్కు ఎంపిక కావడం పట్ల మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, ఆయా గ్రామాల ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియా సైన్స్ఫెయిర్కు తనకు అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ ఎంపికతో తనలో మరింత బాధ్యత పెరిగింది అన్నారు.