Jurala Dam | జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు పోటెత్తుతున్న వరద.. 17 గేట్లు ఎత్తిన అధికారులు..
Jurala Dam | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అటు కృష్ణా.. ఇటు గోదావరి నదుల్లో వరద పోటెత్తుతున్నది.
Jurala Dam | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అటు కృష్ణా.. ఇటు గోదావరి నదుల్లో వరద పోటెత్తుతున్నది. ఎగువన కర్ణాటకలో పడుతున్న భారీ వర్షాలకు గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు వరద పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి 92వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తివేసి దిగువకు 67వేల క్యూసెక్కుల వరదను వదులుతున్నారు.
మరో 33వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వెళ్తున్నది. జారాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతంనీటిమట్టం 317.17 మీటర్లకు చేరుకున్నది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 7.04 టీఎంసీలు ఉన్నది. జూరాల నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. ప్రస్తుతం వర్షాలు కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు శ్రీరాంసాగర్ జలాశయానికి సైతం ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
‘ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి’
Temple Device | టెంపుల్ పరికరం అంటే ఏమిటి.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
హెచ్చరిక సూచికలు నిల్… ప్రమాదాలు పుల్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

