Team India : విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైనా పొట్టి క్రికెట్లో భారత జట్టు (Team India) శకం నడుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఏమంట మొదలైందో అప్పటి నుంచి టీ20ల్లో టీమిండియా జోరు చూపిస్తోంది. అరంభ సీజన్(2007) పొట్టి వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించిన భారత్.. తాజాగా వెస్టిండీస్ గడ్డపై రెండో టీ20 వరల్డ్ కప్‌ను సగర్వంగా ముద్దాడింది. అంతేనా.. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డపై కుర్రాళ్ల సెంచరీల మోతతో మరో పొట్టి సిరీస్ కొల్లగొట్టింది. తద్వారా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆరు టీ20 సిరీస్‌లను మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది.
టీ20 ఫార్మాట్ అంటే చాలు రెచ్చిపోయే కుర్రాళ్లు భారత జట్టుకు కొండంత అండ అవుతున్నారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజాలు వైదొలిగినా ‘మేమున్నామంటూ’ జూనియర్లు సూర్యకుమార్ యాదవ్, సంజా శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్‌లు పంజా విసిరుతున్నారు. వీళ్ల మెరుపు ఇన్నింగ్స్‌లతో ఈ ఏడాది టీమిండియా ఆరో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.
26 T20Is. 24 wins. Attacking, modern-day T20 cricket.
India have truly embraced the format in 2024 🫡 🇮🇳 pic.twitter.com/MyxbUhLbEX
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్థాన్‌ను 3-0తో వైట్ వాష్ చేసిన భారత్.. ఆపై జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని టీమిండియా అజేయంగా 8 విజయాలతో విజేతగా నిలిచింది. పొట్టి కప్ చాంపియన్లుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టు 4-1తో ఆతిథ్య జట్టును మట్టికరిపించి సిరీస్ వశం చేసుకుంది. అనంతరం గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా శ్రీలంకకు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్ బృందం అక్కడా అదరగొట్టింది. లంకకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత కుర్రాళ్లు దంచేయగా 3-0తో సిరీస్ సొంతమైంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో సంజూ శాంసన్, తిలక్ వర్మలు రెండేసి సెంచరీలతో విజృంభించగా టీమిండియా 3-1తో పొట్టి సిరీస్‌ను పట్టేసింది. దాంతో, ఈ ఏడాది ఇప్పటివరకూ 26 టీ20లు ఆడిన భారత్ 24 విజయాలతో ఆధిపత్యాన్ని చెలాయించింది.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!
Congratulations to #TeamIndia on winning the #SAvIND T20I series 3⃣-1⃣ 👏👏
Scorecard – https://t.co/b22K7t9imj pic.twitter.com/oiprSZ8aI2
— BCCI (@BCCI) November 15, 2024