Poonam Kaur | సోషల్ మీడియాలో ప్రస్తుతం నయనతార ధనుష్ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. నయనతారపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీయగా.. ఈ డాక్యుమెంటరీలో తాను నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలో నుంచి 3 సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీ కోసం వాడుకుంది. అయితే ఈ 3 సెకన్ల వీడియో వాడుకోవడంపై చిత్ర నిర్మాత ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించడమే కాకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో ఈ వివాదంపై విసిగిపోయిన నయనతార సోషల్ మీడియా వేదికగా ధనుష్‌పై విమర్శులు కురిపిస్తూ.. బహిరంగ లేఖను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో నయనతారకు ఇండస్ట్రీ నుంచి ఫుల్ మద్దతు లభిస్తుంది.
ఇప్పటికే మలయాళ నటీమణులు పార్వతి తిరువోతుతో పాటు, అనుపమ పరమేశ్వరన్ కూడా నయనతారకు మద్దతుగా నిలిచారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా నటి పూనం కౌర్ కూడా నయనతారకు మద్దతుగా నిలిచింది. అయితే పూనం చేసిన కామెంట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఎందుకు అమ్మ. తన కంటెంట్‌ని అమ్ముకుని కాష్ చేసుకునే హక్కు తనకి ఉన్నపుడు, ధనుష్ కంటెంట్‌ని ధనుష్ కాష్ చేసుకునే హక్కు ఉండదా అంటూ కామెంట్ చేశాడు. దీనిపై పూనం కౌర్ స్పందిస్తూ.. దర్శకుడు త్రివిక్రమ్‌ను ఇందులోకి లాగింది. ఇదే లాజిక్ ప్రకారం త్రివిక్రమ్ కూడా కంటెంట్‌ను కాపీ చేస్తాడు దీని గురించి ఏం అంటారు అంటూ చెప్పుకోచ్చింది. దీంతో దీనిపై ప్రతిసారి త్రివిక్రమ్‌ను తీసుకోస్తావు కానీ అసలు ఏం జరిగిందో మాత్రం చెప్పవు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
What about Trivikram copying content as per few cases ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 16, 2024