అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు (Alliance MLAs) యధేచ్చగా ఇసుక, మద్యం ఆదాయానికి గండికొడుతూ జేబులు నింపుకుంటున్నారని వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ (Margani Bharat ) ఆరోపించారు. శనివారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.
కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇసుకను(Sand) అమ్ముకుంటున్నారని విమర్శించారు. లోపాన్ని అధికారులపై వేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు సిండికేట్గా ఏర్పడి నేరుగా ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో తమకు వాటాలున్నాయని కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
గతంలో వైసీపీ పాలనలో ప్రభుత్వానికి ఇసుక, మద్యం నుంచి గణనీయంగా వేలకోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని అన్నారు. ఇప్పుడు వచ్చే ఆదాయం ఎవరు జేబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉంది, నిత్యవసరాల ధరలు ఆకాశనంటాయని ఆరోపించారు. ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ గురించి దేవుడెరుగు, ఇప్పుడు విద్యుత్ సర్ఛార్జీలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియా వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టింగులు పెట్టారని స్వయాన రాష్ట్ర పోలీసులే ప్రకటించిన విషాయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో రూ. 14 లక్షల కోట్లు అప్పు చేసిందని దుష్ప్రచారం చేసి, తాజా బడ్జెట్లో రూ. 6 లక్షల 46 వేల కోట్లు అప్పు చూపించారని విమర్శించారు.