Tabraiz Shamsi : టీ20ల యుగంలో క్రికెటర్లకు కోట్లకొద్దీ ఆదాయం వస్తోంది. పైగా ఫ్రాంచైజీలకు ఆడడం ద్వారా పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయంగా పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నారు. అందుకనే కొందరు జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ క్రికెట్ (Franchise Cricket)కే తొలి ఓటు వేస్తున్నారు. అందులో భాగంగానే దేశం తరఫున సెంట్రల్ కాంట్రాక్ట్ సైతం వదులుకునేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ (Tabraiz Shamsi) కూడా చేరాడు.
ఎడమచేతివాటం స్పిన్నర్ అయిన షంసీ సషారీ సెలెక్టర్లకు షాకిచ్చాడు. ఇకపై తనను సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం పరిగణించ వద్దని చెప్పేశాడు. మణికట్టు స్పిన్నర్ అయిన షంసీ ఇంకా ఏం అన్నాడంటే.. ‘ప్రపంచ క్రికెట్లో నాకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నా. అందకనే సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్నా.
Cricket South Africa (CSA) and Proteas Men’s spinner Tabraiz Shamsi have today jointly announced that the 34-year-old has decided to opt out of his national contract, effective immediately.
The move will allow Shamsi, who has played 51 One-Day Internationals and 70 T20… pic.twitter.com/Bm7VAUbOKQ
— Proteas Men (@ProteasMenCSA) October 3, 2024
అయితే.. దేశం కోసం ఆడేందుకు కట్టుబడి ఉన్నాను. దక్షిణాఫ్రికా తరఫున ఆడాల్సి వస్తే కచ్చితంగా అందుబాటులో ఉంటాను’ అని చెప్పాడు. మరోవైపు దక్షిణాఫ్రికా బోర్డు కూడా షంసీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఓ ప్రటన విడుదల చేసింది. ‘వన్డేలు, టీ20ల్లో దక్షిణాఫ్రికాకు షంసీ కీలకమైన ఆటగాడు. అయితే.. మేము అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాం. అదేసమయంలో అతడు దక్షిణాఫ్రికా జట్టుకు ఆడేందుకు కట్టుబడి ఉన్నందుకు సంతోషిస్తున్నాం. ఈ విషయంలో షంసీ నిజాయతీని మెచ్చుకుంటున్నాం’ అని దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనొచ్ క్వెవే వెల్లడించాడు.
మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన షంసీ దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడు. అయితే.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సఫారీల ఓటమి తర్వాత షంసీ బ్రేక్ తీసుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అఫ్గనిస్థాన్, ఐర్లాండ్‌తో యూఏఈలో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకూ షంసీ రెండు టెస్టులు, 51 వన్డేలు, 70 టీ20లు ఆడాడు.