Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్‌లో కంచు పతకంతో మెరిసిన షూటర్ స్వప్నిల్ కుసాలే (Swapnil Kusale) పేరు దేశమంతా మార్మోగింది. విశ్వ క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్.. లాస్ ఏంజిల్స్ పోటీలపై గురి పెట్టాడు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ చేజారడంపై ఈ యువ షూటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్నెస్ లేకపోవడం వల్లనే తాను పసిడి చేజార్చుకున్నానని అన్నాడు.
వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా బంగారు పతకం గెలుస్తానని కుసాలే ధీమా వ్యక్తం చేశాడు. ‘శారీరకంగా ఫిట్‌గా లేకపోవడంలో పారిస్‌లో స్వర్ణం కోల్పోయాను. నేను ఆరో స్థానంలో ఉన్నప్పుడు స్క్రీన్ మీదున్న లక్ష్యాన్ని సరిగ్గా గురి చూడలేకపోయాను. టార్గెట్ మీద ఫోకస్ పెట్టాలనుకున్నా. కానీ, ఫిజికల్ ఫిట్నెస్ ఇక ఫిట్‌నెస్‌పై నేను మరింత దృష్టి సారిస్తాను. వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ కలను
నిజం చేసుకుంటాను’ అని కుసాలే తెలిపాడు.
అంతేకాదు తనకు స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం అధికారులు తనకు ఆర్ధికంగా అండగా నిలిచారని అన్నాడు. స్వదేశం వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీతో సంభాషణ గురించి కూడా కుసాలే చెప్పాడు. ‘ఒలింపిక్స్‌లో పతకం సాధించినందుకు ప్రధాని నన్ను అభినందించారు. దేశానికి పతకం అందించిన క్షణం ఎంతో గర్వకారణం అని మోడీ నాతో అన్నారు’ అని కుసాలే వెల్లడించాడు.