Arjun Reddy | టాలీవుడ్ నుంచి విడుదలైన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన అరుదైన సినిమాల్లో ఒకటి అర్జున్ రెడ్డి (Arjun Reddy). ఫ్యామిలీ హీరోగా క్లాస్ ఫాలోయింగ్ మాత్రమే ఉన్న విజయ్ దేవరకొండకు మాస్ ఇమేజ్ తీసుకురావడమే కాదు.. ఈ స్టార్ యాక్టర్ కెరీర్ అర్జున్ రెడ్డికి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకునే చేసింది చిత్రం. సందీప్ రెడ్డి వంగా డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీలోనే బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన అర్జున్ రెడ్డి నేటికి విజయవంతంగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి పదేండ్లు పూర్తి చేసుకునేప్పటికీ అర్జున్ రెడ్డి ఫుల్ కట్‌ను జనాలు ఇచ్చేయండి.. సినిమా ఏడేండ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నా. చాలా క్షణాలు గుర్తుకొస్తున్నాయి.. అంటూ అర్జున్ రెడ్డి షూటింగ్ స్పాట్ త్రోబ్యాక్ స్టిల్స్‌ను షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడీ ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
ఈ చిత్రంతో జబల్ పూర్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మేనియా ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హద్దులను చెరిపేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది. ఆగస్టు 25..ఈ డేట్‌కు నా జీవితంలో ముఖ్యమైన స్థానం ఉంది. ఐదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా అర్జున్ రెడ్డి విడుదలైంది.
ఈ సినిమా నా మరపురాని క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్రపై నాకు లభించిన ప్రేమ, ప్రశంసలు అపూర్వమైనవి. అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అర్జున్ రెడ్డికి నేను రుణపడి ఉంటాను.. అంటూ రెండేళ్ల క్రితం షాలినీ పాండే పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
Give the people ‘The SandeepVanga #ArjunReddy full cut’ for the 10 years anniversary @imvangasandeep!
I cannot believe it is 7 years already, remember so many moments as if it was last year ❤️ pic.twitter.com/J8CmcByHae
— Vijay Deverakonda (@TheDeverakonda) August 25, 2024
Karthikeya 2 | సెలబ్రేషన్స్‌లో నిఖిల్ కార్తికేయ 2 టీం.. హాజరైన ఇండస్ట్రీ ప్రముఖులు
35 Chinna Katha Kaadu | నివేదా థామస్ 35 చిన్న కథ కాదు థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్..!
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు