ECB : స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్(England)కు ఊహించని షాక్. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. దాంతో, అతడి స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జోష్ హల్(Josh Hull)ను ఎంపిక చేసినట్టు ఆదివారం ఇంగ్లండ్ సెలెక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు. లీసెస్టర్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్న హల్ టెస్టు క్యాప్ అందుకోవడం ఇదే మొదటిసారి.
‘శ్రీలంకతో జరుగుతున్న రోత్సే టెస్టు సిరీస్ నుంచి ఇంగ్లండ్ పురుషుల జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వైదొలిగాడు. గాయంతో బాధపడుతున్న అతడికి స్కానింగ్ పరీక్షలు చేశాక ఎడమ తొడ కండరాల్లో సమస్య ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అందుకని అతడు నాలుగో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. అతడికి విశ్రాంతి అవసరం గనుక 20 ఏండ్ల జోష్ హల్‌ను ఎంపిక చేశాం’ అని ఈసీబీ వెల్లడించింది.
6ft 7in 📈
Left-Arm Fast 🚀
Introducing, Josh Hull!
🏴 #ENGvSL 🇱🇰 #EnglandCricket pic.twitter.com/3p0CpsFhp9— England Cricket (@englandcricket) August 25, 2024
ఆరు అడుగుల 7 ఇంచుల పొడవుంటే జోష్ హల్ నిఖార్సైన పేసర్‌గా ఎదుగుతున్నాడు. లీసెస్టర్‌షైర్ జట్టు తరఫున అతడు అద్భుతంగా రాణించాడు. టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు ఆడిన ఈ పొడగరి పేసర్ శ్రీలంకపై 5-74తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అందుకని మిగతా రెండు టెస్టుల్లో అతడు తమ తరపుముక్క అవుతాడని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది.
శ్రీలంకతో ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరిగిన తొల టెస్టులో వుడ్ గాయపడ్డాడు. మూడో రోజు 11వ ఓవర్ వేసే సమయంలో అతడు కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దాంతో, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన వుడ్ మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. స్కానింగ్ పరీక్షల్లో అతడి కుడి తొడకు గాయమైనట్టు వైద్యులు తేల్చారు. అందుకని ఇంగ్లండ్ సెలెక్టర్లు అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య రెండో టెస్టు లార్డ్స్‌లో ఆగస్టు 27న మొదలవ్వనుంది.