IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి మ్యాచ్‌లోనే భారత్ (Team India)భారీ స్కోర్ కొట్టింది. పల్లెకెలె స్టేడియంలో లంక బౌలర్లను టీమిండియా హిట్టర్లు ఉతికేయగా 213 పరుగులు చేసింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్(58 :26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. వరల్డ్ కప్ హీరోలు రిషభ్ పంత్(49), ఓపెనర్ యశస్వీ జైస్వాల్(44)లు సైతం వీరవిహారం చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన టీమిండియాకు యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(40), శుభ్‌మన్ గిల్(34)లు అదిరే అరంభమిచ్చారు. తొలి ఓవర్ నుంచే లంక బౌలర్లను చీల్చిచెండాడుతూ బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టడంతో స్కోర్ బోర్డు పరుగలు పెట్టింది. 5 ఓవర్లకే స్కోర్ 50 దాటింది. అయితే.. దిల్షాన్ మధుశనక వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది చివరి బంతికి క్యాచ్ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బంతి అందుకున్న వనిందు హసరంగ డేంజరస్ యశస్వీని బోల్తా కొట్టించాడు.
Innings Break!
A solid batting performance from #TeamIndia! 💪
5⃣8⃣ for Captain @surya_14kumar
4⃣9⃣ for @RishabhPant17
4⃣0⃣ for @ybj_19
3⃣4⃣ for vice-captain @ShubmanGillOver to our bowlers now! 👍
Scorecard ▶️ https://t.co/Ccm4ubmWnj #SLvIND pic.twitter.com/1KcC7etLU2
— BCCI (@BCCI) July 27, 2024
డిఫెన్స్ ఆడబోయిన యశస్వీని వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ స్టంపౌట్ చేశాడు. దాంతో, టీమిండియా 74 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. చిచ్చరపిడుగులు ఇద్దరూ ఔట్ కావడంతో లంక బౌలర్లు బతికిపోయామురా అన్నట్టు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత రిషభ్ పంత్(49) జతగా సూర్యకుమార్ యాదవ్(58: 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తనమార్క్ షాట్లతో అలరిస్తూ స్కోర్ వేగం పెంచాడు.
Skipper SKY falls, striking at 200+ en route to his fifty 🔥https://t.co/fozZBSbiLQ #SLvIND pic.twitter.com/zO6cWV71dE
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2024
పథిరన బౌలింగ్‌లో సూర్య ఔటయ్యాక గేర్ మార్చిన పంత్ జట్టు స్కోర్ 200 దాటించాడు. అయితే.. డెత్ ఓవర్లలో పంత్ ధాటికి భారీగా పరుగులు ఇచ్చుకున్న పథిరన.. వరుసగా వికెట్లు తీయడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. అయితే.. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని అక్షర్ పటేల్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో, భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 రన్స్ కొట్టింది.