Health Tips | మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు ఈ గింజలతో అద్భుత పరిష్కారం.. అవేంటంటే..?
Health Tips : ఈ రోజుల్లో మహిళల్లో పాలిసిస్టైన్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఓవరీ డిసీజ్ (PCOD) అనేవి సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది మహిళల్లో ఒకరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలు తరచూ ఈ ఆరు రకాల గింజలు తీసుకోవడంవల్ల హార్మోన్లు సమంగా విడుదలై సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి ఆ గింజలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Health Tips : ఈ రోజుల్లో మహిళల్లో పాలిసిస్టైన్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఓవరీ డిసీజ్ (PCOD) అనేవి సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది మహిళల్లో ఒకరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమందిలో ఇన్సులిన్ నిరోధం కారణంగా ఈ సమస్యలు వస్తున్నట్లు తేలింది. ఇన్సులిన్ నిరోధంవల్ల హార్మోన్ల విడుదలలో అసమతుల్యత ఏర్పడి, చక్కెరల వినియోగం ఎక్కువ జరగక షుగర్ లెవల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే పోషకాహారం తీసుకునే వారిలో ఈ PCOS, PCOD సమస్యలు తగ్గుముఖం పట్టడమేగాక, బరువు కూడా తగ్గుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. మహిళలు తరచూ ఈ ఆరు రకాల గింజలు తీసుకోవడంవల్ల హార్మోన్లు సమంగా విడుదలై సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి ఆ గింజలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. చియా సీడ్స్
చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మనిషి శరీర బరువు తగ్గడానికి, రక్తంలో షుగర్ లెవల్స్ మెరుగుపడటానికి తోడ్పడుతాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో సమస్యను తగ్గించడానికి కూడా ఈ చియా గింజలు తోడ్పడుతాయి.
2. పొద్దుతిరుగుడు సీడ్స్
పొద్దు తిరుగుడు గింజల్లో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ నిర్విషీకరణకు తోడ్పడి హార్మోన్ల సక్రమ విడుదలకు దోహదం చేస్తుంది. అంతేగాక ఫ్యాట్ కంటెంట్ కూడా పొద్దు తిరుగుడులో చాలా ఎక్కువ. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలుంటాయి. పైగా ఫైబర్లు, ప్రొటీన్లు కూడా ఈ పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి.
3. గుమ్మడి సీడ్స్
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే గుమ్మడి గింజలను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల మోనోపాజ్ తర్వాత మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడే రిస్క్ తగ్గుతుంది.
4. అవిసె గింజలు
అవిసె గింజల్లో ఒమేగా-3 ALA, ఫైబర్ కంటెంట్ కావాల్సినంత ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతాస్థితిలో ఉంచడానికి తోడ్పడుతాయి. PCOS, PCOD సమస్యలవల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా నిరోధిస్తాయి. అదేవిధంగా శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అంతేగాక సంతాన సాఫల్యతను కూడా పెంచుతాయి.
5. నువ్వు సీడ్స్
నువ్వు గింజల్లో కాల్షియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ప్రొటీన్లు కూడా ఈ నువ్వు గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమానతలను క్రమబద్దీకరించడంలో బాగా ఉపయోగపడుతాయి.
6. జనుము సీడ్స్
జనుము గింజల్లో GLAగా పిలిచే ఒక రకమైన ఒమేగా-6 ఫ్యాట్ ఉంటుంది. హార్మోన్లను క్రమతాస్థితిలో ఉంచడానికి జనుములు తోడ్పడుతాయి. వీటిలో ఫైటో కాంపౌండ్స్ కూడా విరివిగా ఉంటాయి. ఇవి మహిళల్లో మోనోపాజ్ దశలో వచ్చే దుష్ప్రభావాలను నిరోధిస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

