Team India : స్వదేశంలో తొలిసారి వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు మరో సిరీస్‌పై ఆశలు పెట్టుకుంది. సొంతగడ్డపై ఘనమైన రికార్డుకు న్యూజిలాండ్ గండికొట్టగా ఇక పొట్టి సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పోది చేసుకోవాలనే కసితో దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour)కు వెళ్లింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథ్యంలోని యువ టీమిండియా సోమవారం డర్బన్‌లో వాలిపోయింది. భారత క్రికెటర్లు సఫారీ గడ్డపై అడుగుపెట్టిందనే విషయాన్ని తెలుపుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వీడియో విడుదల చేసింది.
సఫారీలతో పొట్టి సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు బలమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశాడు. ఉప్పల్ స్టేడియంలో విధ్వంసక శతకం బాదిన శాంసన్, మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు చోటు కల్పించారు. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో దంచికొట్టిన అభిషేక్, రమన్‌దీప్ సింగ్‌లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
🚨 NEWS 🚨
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
— BCCI (@BCCI) October 25, 2024
భారత స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్, యశ్ దయాల్, అవేశ్ ఖాన్.
సూర్యకుమార్ యాదవ్ సారథిగా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమిండియా అక్కడ 4 టీ20లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంబర్ 8వ తేదీన తొలి మ్యాచ్‌తో టీ20 సిరీస్ మొదలవ్వనుంది. అనంతరం నవంబర్ 10న రెండో మ్యాచ్, నవంబర్ 13న మూడో టీ20, నవంబర్ 15న చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడి తొలి ట్రోఫీ చేజార్చుకున్న మర్క్రమ్ సేన ప్రతీకార విజయంపై కన్నేసింది.
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరేరీ, ఆండిలే సిమెలమె, మిహ్లలీ పొంగ్వానా, మార్కొ జాన్సెన్, పాట్రిక్ క్రుగెర్, కాబా పీటర్, గెరాల్డ్ కొయెట్జ్, ఒట్నెల్ బార్ట్‌మన్, లుథో సిపమ్లా, కేశవ్ మహరాజ్.