IPL Mega Auction : ఐపీఎల్ 18వ సీజన్ కోసం రిటెన్షన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు మెగా వేలంపై అందరి కండ్లు నిలిచాయి. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో వేలం జరుగుతుందనే వార్తలు వినిపించగా.. నవంబర్ 25, 26 తేదీల్లో వేలం ఉంటుందని కథనాలు వచ్చాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ వేలం తేదీలను బీసీసీఐ ఖరారు చేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో మెగా వేలం పాట నిర్వహించనున్నారని వినికిడి. ఈ తేదీలపై త్వరలోనే బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రతి మూడేండ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం నిర్వహిస్తారు. ఆరంభ సీజన్ 2008 నుంచి ఈ సాంప్రదాయన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది.
IPL Mega Auction 2025 pic.twitter.com/LzCrJugawr
— RVCJ Media (@RVCJ_FB) November 4, 2024
ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ గడువు పూర్తయ్యంది. ప్రతి ఫ్రాంచైజీ అవసరమైన వాళ్లను మాత్రమే అట్టిపెట్టుకొని భారంగా మారిన వాళ్లను నిర్మోహమాటంగా వదిలేశాయి. ఇక మిగిలింది వేలం మాత్రమే. అందుకని మెగా వేలం జరిపేందుకు బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సిద్ధమవుతున్నాయి.
17వ సీజన్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) రికార్డు ధర పలకగా.. కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) రెండో స్థానంలో నిలిచాడు. దాంతో, ఈసారి కండ్లు చెదిరే ధర పలికేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే.. ఈసారి రిషభ్ పంత్ రూ.25 నుంచి రూ.30 కోట్లు కొల్లగొడుతాని విశ్లేషకులు, క్రీడా పండితులు ఘంటాపథంగా చెబుతున్నారు.
🚨 All the retained players ahead of the mega auction for IPL 2025 🚨https://t.co/zKx8wr8Yn3 | #IPL2025 pic.twitter.com/pbcxt9v3iZ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024