IPL 2025 : చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్(57) రెచ్చిపోయాడు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలమైనా.. తన విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మిస్టర్ 360.. ఆఖరి ఓవర్లలో దంచికొట్టాడు. యువకెరటం నమన్ ధిర్(20) అండగా 31 రన్స్ జోడించిన అతడు.. ముంబై స్కోర్ 180 దాటించాడు. అయితే.. తమ చివరి ఓవర్లలో జేమీసన్ 5, అర్ష్‌దీప్ 3 పరుగులే ఇవ్వడంతో ముంబై 184కే పరిమితం అయింది.
వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. జైపూర్‌లో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై.. ఆఖర్లో పుంజుకొని భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్(27), రోహిత్ శర్మ(24)లు చక్కని ఆరంభం ఇచ్చారు. పంజాబ్ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో తొలి రెండు ఓవర్లు 17 రన్స్ వచ్చాయంతే. మూడో ఓవర్ తర్వాత గేర్ మార్చిన రికెల్టన్ .. జేమీసన్‌ను ఉతికేస్తూ రెండు పోర్లతో ఊపు తెచ్చాడు. నాలుగో ఓవర్ తర్వాత స్పీడ్ పెంచిన రోహిత్ కూడా హర్‌ప్రీత్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టాడు. అయితే.. 5వ ఓవర్లో యాన్సెన్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన రికెల్టన్.. అయ్యర్ చేతికి చిక్కాడు అంతే.. 45 వద్ద ముంబై తొలివి కెట్ పడింది.
Vyshak delivers with double dose of breakthroughs 👊#MI are 113/4 after 13 overs.
Updates ▶ https://t.co/Dsw52HOtga#TATAIPL | #PBKSvMI | @PunjabKingsIPL pic.twitter.com/tC8jAQdsxz
— IndianPremierLeague (@IPL) May 26, 2025
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(57).. హిట్‌మ్యాన్ జతగా చెలరేగాడు. రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించి.. ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు. హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్లో రోహిత్ ఔట్ అయ్యాక వచ్చిన తిలక్ వర్మ(1), విల్ జాక్స్(17)లు విఫలమయ్యారు. 106కే నాలుగు వికెట్ఉల పడిన జట్టును కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26)తో కలిసి ఆదుకున్నాడు సూర్య. ఉన్నంత సేపు ధనాధన్ ఆడిన పాండ్యా… యాన్సెన్ ఓవర్లో సిక్సర్ బాదాడు. కానీ, మరో షాట్‌కు యత్నించగా ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ ఇంగ్లిస్ అందుకున్నాడు.
Naman Dhir with another class finishing act 🚀
🎥 Watch as he launched back-to-back maximums against Vijaykumar Vyshak during his cameo 💪
Updates ▶ https://t.co/Dsw52HOtga#TATAIPL | #PBKSvMI | @mipaltan pic.twitter.com/dJsifGVtCV
— IndianPremierLeague (@IPL) May 26, 2025
ఆ తర్వాత.. జేమీసన్ 5 రన్స్ ఇచ్చాడంతే. దాంతో, ముంబై స్కోర్ 180 దాటడం కష్టమే అనిపించింది. అయితే.. 19వ ఓవర్ తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన నమన్ ధిర్(20).. రెండో బంతినీ సిక్సర్‌గా మలిచాడు. అదే ఓవర్లో 4, 2తో సూర్య అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో విజయ్ కుమార్ 23 రన్స్ ఇవ్వగా ముంబై స్కోర్ 180కి చేరింది. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ మూడే పరుగులు ఇవ్వడంతో ముంబై 184కే పరిమితమైంది.