మాగనూరు : పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించిన మండల టాపర్లకు బీటీఎం ఫౌండేషన్ ( BTM Foundation ) ఘనంగా సన్మానించింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు బి తిమ్మన్న మాట్లాడుతూ ఫౌండేషన్ వార్షికోత్సవ సందర్భంగా మక్తల్, మాగనూరు, కృష్ణ, మండలాలలో చదువుతున్న పదో తరగతి ( Tenth ) ఇంటర్ ( Inter ) మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతూ మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు, క్లాస్ ఆఫర్లుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు.
విద్యార్థులను ప్రోత్సహించి ముందుకు నడిపించడంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న బీటీఎం ఫౌండేషన్ను పలువురు అభినందించారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకొని , తల్లిదండ్రులకు, గురువులకు పేరు ,ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నేరడగం మఠం పీఠాధిపతి సిద్ధలింగ మహాస్వామి, మోటివేషనల్ స్పీకర్ సయ్యద్ మోహిత్, బీఆర్ఎస్ కృష్ణా మండలం యువ నాయకులు శివరాజ్ పటేల్, మాగనూరు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, అడ్వకేట్ అయ్యప్ప, రాఘవేంద్ర, భాస్కర్, సునీత, వెంకటేష్, బాలరాజు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.