KTR | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. సహకరిస్తానన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..!
KTR | ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
KTR | ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమైనప్పటికీ.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను కచ్చితంగా ఏసీబీకి సహకరిస్తానన్నారు. యూకే, అమెరికా పర్యటన ముందుగానే కోసం ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని తెలిపారు.
ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశానన్నారు. రాజకీయ ప్రతీకారం దాహాం తీర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి తహతహలాడుతూ ముందుకెళ్తున్న తీరును అభినందిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. 48గంటల కిందట నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సీఎం రేవంత్‌రెడ్డి పేరు కనిపించిందని.. 24గంటల క్రితమే ప్రధాని సహా బీజేపీ అగ్రనేతలను రేవంత్ కలిశాడని ఆరోపించారు. ఇవాళ తనకు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు. మనీలాండరింగ్‌లో రేవంత్ ప్రమేయంపై బీజేపీ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి నాయకుడిగా, పాలకుడిగా విఫలం అయ్యారంటూ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.
The ACB has given me a notice to appear for an enquiry on the 28th of May in the Formula E case
As a law abiding citizen, will definitely cooperate with the agencies even though the case is nothing but pure political harassment
As I have planned to leave for the UK & USA for…
— KTR (@KTRBRS) May 26, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

