Suryakumar Yadav : భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న రెండో వన్డేలో సూర్య శివమెత్తినట్టు చెలరేగాడు. కామెరూన్ గ్రీన్(Cameron Green) వేసిన 44వ ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సులు బాదాడు. అతడి ఊపు చూస్తుంటే 2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్(Yuvraj Singh)లా ఆర్ సిక్స్‌లు కొడతానిపించింది.
కానీ, గ్రీన్ ఐదో బంతిని తెలివిగా వేయడంతో సింగిల్ మాత్రమే వచ్చింది. సూర్య ధాటికి ఆ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. సూర్య 4 సిక్సర్ల వీడియోను బీసీసీఐ(BCCI) ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
6⃣6⃣6⃣6⃣
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
— BCCI (@BCCI) September 24, 2023
ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన కంగారు కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే.. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్(52 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(43 నాటౌట్) దంచి కొడుతున్నారు. దాంతో, టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.