IPL 2025: ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(61) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. భారీ ఛేదనలో ఒంటరి సైనికుడిలా పోరాడుతున్న అతడు అర్ధ శతకం సాధించాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు సూర్య. అంతేకాదు ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా తిలక్ వర్మ(14)తో కలిసి నాలుగో వికటె్కు 50 ప్లస్ రన్స్ జోడించాడీ మిస్టర్ 360 ప్లేయర్. దాంతో, ముంబై విజయం దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లకు స్కోర్.. 143-3. ముంబై విజయానికి ఇంకా 30 బంతుల్లో 61 పరుగులు కావాలంతే.
భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆదిలో తడడినా పుంజుకుంది. ఓపెనర్ విల్ జాక్స్(5)ను ఔట్ చేసిన ఆకాశ్ దీప్ లక్నోకు బ్రేకిచ్చాడు. బౌండరీ లైన్ వద్ద రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో జాక్స్ వెనుదిరిగాడు. ఆ తర్వాతి శార్ధూల్ ఠాకూర్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన రియాన్ రికెల్టన్(10) సైతం బిష్ణోయ్ చేతికే చిక్కాడు. దాంతో, 17 పరుగులకే ముంబై కష్టాల్లో పడింది అయితే. కుర్ర బ్యాటర్ నమన్ ధిర్(46) చెలరేగి ఆడాడు. అతడు ఆకాశ్ దీప్ వేసిన ఓవర్లో 6, 6, 4, 4 బాది 21 పరుగులు పిండుకున్నాడు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత నమన్ ధిర్‌ను ఔట్ చేసిన దిగ్వేశ్ రధీ మరోసారి నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. 69 పరుగుల భాగస్వామ్యాన్ని దిగ్వేశ్ విడదీయడంతో లక్నో శిబిరం ఊపిరిపీల్చుకుంది.
Fearless. Flawless. Fast ⏩
Naman Dhir departs after a 🔝 46 (24) run knock that brought #MI back in the chase after a tough start.
Updates ▶️ https://t.co/HHS1Gsb3Wz#TATAIPL | #LSGvMI pic.twitter.com/dKU2gZFjCS
— IndianPremierLeague (@IPL) April 4, 2025
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. సొంత మైదానంలో ఓపెనర్ మిచెల్ మార్ష్(60), ఎడెన్ మర్క్రమ్(53) అర్ధ శతకాలతో విజృంభించగా ముంబై ఇండియన్స్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది లక్నో. పవర్ ప్లేలో చెలరేగి ఆడగా.. మిడిల్ ఓవర్లలో మర్క్రమ్ బౌండరీలతో ముంబై బౌలర్లను ఉతికేశాడు. ఆయుష్ బదొని(30)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. జట్టు స్కోర్ 150 దాటించాడు. డెత్ ఓవర్లలో పుంజుకున్న ముంబై.. ఈ ఇద్దరిని పెవిలియన్ పంపింది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(27) ధనాధన్ ఆడడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.