IPL 2025 : భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్(34) చెలరేగి ఆడుతున్నాడు. 17 రన్స్‌కే ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరగడంతో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్న అతడు.. ఆకాశ్ దీప్ వేసిన ఓవర్లో 21 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతిని ఫైన్‌లెగ్‌లో సిక్సర్‌గా మలిచిన నమన్.. ఆ తర్వాత వరుసగా 6, 4, 4 బాదాడు. ఐదో ఓవర్ ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్(10) బౌండరీ బాదాడు. దాంతో, ముంబై పవర్ ప్లేలో 2 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
లక్నో నిర్దేశించిన 204 పరుగుల ఛేదనలో ముంబైకి ఆదిలోనే షాకిచ్చాడు పేసర్ ఆకాశ్ దీప్. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న అతడు.. విల్ జాక్స్(5)ను ఔట్ చేసి లక్నోకు బ్రేకిచ్చాడు. బౌండరీ లైన్ వద్ద రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో జాక్స్ వెనుదిరిగాడు. ఆ తర్వాతి శార్ధూల్ ఠాకూర్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన రియాన్ రికెల్టన్(10) సైతం బిష్ణోయ్ చేతికే చిక్కాడు. దాంతో, 17 పరుగులకే ముంబై కష్టాల్లో పడింది.