IPL 2025 : భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి వస్తున్నాడు. ఎనిమిది సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన పంత్ ఈసారి ఫ్రాంచైజీకి బై బై చెప్పేశాడు. దాంతో, అతడిని దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. నవంబర్‌లో జరుగబోయే మెగా వేలంలో పంత్ రికార్డు ధర పలికే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. పంత్‌ను కొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) సిద్ధంగా ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా పంత్ చెన్నై జట్టుతో కొనసాగుతాడని గత రెండు మూడు నెలల నుంచి మీడియాలో కథనాలు వచ్చాయి. అవన్నీ నిజమే అనిపిస్తోంది. రిటెన్షన్ జాబితా వచ్చిన మరునాడే మహీ భాయ్‌తో పంత్ కనిపించాడు. ఈ ఇద్దరూ ఢిల్లీలో ఒకే చోట ఉండడం తాను చూశానని.. త్వరలోనే ఒకరు పసుపు జెర్సీ వేసుకోనున్నారని సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్ రైనా వెల్లడించాడు.
“I met MS Dhoni in Delhi and Rishabh Pant was also there with us. So someone will be wearing a yellow jersey soon”🦁
– Suresh Raina (Jio Cinema)#IPLRetention #Pant #CSK #Dhoni
— Mufaddal Bumrah (@IShowUpdates07) October 31, 2024
‘నేను ఈ మధ్యే ఢిల్లీలో ధోనీని కలిశాను. అక్కడే ధోనీతో పంత్‌ను చూశాను. ఏదో ఒక పెద్ద మార్పు జరుగబోతోందని నాకు అనిపిస్తోంది. ఎవరో ఒకరు త్వరలోనే పసుపు జెర్సీ వేసుకోనున్నారు’ అని రైనా తెలిపాడు. ఐపీఎల్లో సీఎస్కే ఆడిన రైనా చిన్న తాలాగా పేరొందాడు. ధోనీతో మంచి అనుబంధం కలిగిన రైనాకు అతడి గురించి చాలా విషయాలు తెలుసు. అయితే.. ఢిల్లీలో పంత్‌తో ధోనీ ఏం మాట్లాడాడు? అనే విషయం మాత్రం రైనా చెప్పలేదు. దాంతో, అసలు మహీ, పంత్‌ల మధ్య ఏ చర్చ నడిచింది? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Thank You Delhi Capital for Everything ❤💙
Rishabh Pant IPL Journey with Delhi Capitals from 2016-2024 🙌🏻🐐
A Thread
1. 2016-2018 pic.twitter.com/TLmQ08pTfK— rishabh_dines17💙 (@Rishabh_pant717) November 1, 2024
18వ సీజన్ వేలం ఆసక్తిగా ఉండనుంది. స్టార్ ఆటగాళ్లు వేలం పాటకు వస్తుండడంతో ఏ ఫ్రాంచైజీ వాళ్లను కొనుగోలు చేయనుంది? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయస్ అయ్యర్లు ఈసారి కొత్త జట్టుకు ఆడడం ఖాయమైంది. నవంబర్ 25, 26వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరుగనుందని సమాచారం.