అమరావతి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే టీడీపీ (TDP) లక్ష్యంతో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలకు (Dwakra communities) పూర్వవైభవం తీసుకొస్తానని ఏపీ సీఎం చంద్రబాబు (Chandra babu) ప్రకటించారు. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా ఈదుపురంలో శుక్రవారం దీపం-2ను (Deepam-2) ప్రారంభించి గ్రామస్థులనుద్దేశించి మాట్లాడారు.
ఉచిత సిలిండర్ల పంపిణీ ద్వారా పేద మహిళలకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు (Gas Conection) ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం ప్రారంభించిన ఉచిత సిలిండర్లకు గ్యాస్ డెలివరి అయిన 48 గంటల్లోనే వారి అకౌంట్లో డబ్బును జమ చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్లో ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే ప్రక్రియను మొదలు పెడుతామని వెల్లడించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని వివరించారు. చెడుపై మంచి గెలిచిందనే దీపావళి జరుపుకుంటున్నామని, అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న దుష్పరిపాలనకు అంతం పాడారని పేర్కొన్నారు. గత ఐదేళ్లు స్వేచ్ఛలేని దౌర్భగ్యపు పాలన చూశామని పేర్కొన్నారు. నాయకులు వస్తే పరదాలు, చెట్లు నరకడం ఉండకూడదని పరోక్షంగా వైఎస్ జగన్ను ఉద్దేశించి అన్నారు.
గతంలో ఐదారు జిల్లాల నుంచి జనాలను తరలించేవాళ్లని ఆరోపించారు. తెలుగుతమ్ముళ్లు, జనసైనికులు కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో తప్పు చేసిన వాళ్లను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. అయితే తాను బాధ్యత గల వ్యక్తిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడనని వెల్లడించారు.
,