Ravindra Jadeja : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సుదీర్ఘ ఫార్మాట్లో మరో ఘనత సాధించాడు. వాంఖడే టెస్టులో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు తీసిన జడేజా టెస్టుల్లో 14వ సారి ఈ ప్రదర్శన చేశాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా జడ్డూ రికార్డు సృష్టించాడు. వాంఖడేలో అతడి విజృంభణతో వెటరన్ పేసర్లు జహీర్ ఖాన్ (Zaheer Khan), ఇషాంత్ శర్మ(Ishant Sharma)ల రికార్డులు గల్లంతయ్యాయి.
జహీర్, ఇషాంత్‌లు టెస్టుల్లో 311 వికెట్లు తీయగా జడేజా వాళ్లను అధిగమిస్తూ 312వ వికెట్ పడగొట్టాడు. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో 3 వేల రన్స్, మూడొందలకుపైగా వికెట్లతో జడ్డూ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సరసన నిలిచాడు. జడేజా, భజ్జీల కంటే ముందు కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ ఘనత సాధించారు. అంతేకాదు ఇంగ్లండ్ లెజెండ్ ఇయాన్ బోథమ్ తర్వాత వేగంగా టెస్టుల్లో 3 వేల పరుగులు, 300ల వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా జడేజా మరో రికార్డు నెలకొల్పాడు.
Bowling brilliance ✨
Recap Ravindra Jadeja’s skilful five-wicket haul in Mumbai 🎥🔽 #TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @imjadeja https://t.co/gQIWktNswi
— BCCI (@BCCI) November 1, 2024
వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ మూడో సెషన్లోనే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా టీ తర్వాత కాసేపటికే కివీస్ కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(481)లు తిప్పేయగా 250 లోపే పర్యాటక జట్లు ఇన్నింగ్స్ ముగిసింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డారిల్ మిచెల్(82)ను ఔట్ చేసిన సుందర్.. అజాజ్ పటేల్(7)ను ఎల్బీగా వెనక్కి పంపి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దాంతో, కివీస్ 235 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది.
◾ Jadeja’s second Test five-for of the year
◾ Washington’s second Test four-for in a rowSome excellent Test match bowling on display 🤝
🔗 https://t.co/bnmexdFFSD | #INDvNZ pic.twitter.com/KSjufPfQev
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024