వయనాడ్: కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రా(Priyanka Gandhi).. వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీపడుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీ నుంచి ఆమె ఆ ఎన్నికల ప్రచారంలో తిరిగి పాల్గొననున్నారు. నియోజవకర్గంలో ఆమె పబ్లిక్, కార్నర్ మీటింగ్లను నిర్వహించనున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు. 3వ తేదీన 11 గంటలకు మనంతవాది గాంధీ పార్క్ వద్ద రాహుల్, ప్రియాంకాలు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మూడు చోట్ల ప్రియాంకా కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నంది. అరీకోడ్లో రాహుల్ మరో మీటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 4వ తేదీన కాల్పెట్టా, సుల్తాన్ బాథరే నియోజకవర్గాల్లో ప్రియాంకా కార్నర్ మీటింగ్లు నిర్వహించనున్నారు. 5,6,7 తేదీలకు చెందిన ప్రచార షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదు.