లడాఖ్: ఈస్ట్రన్ లడాక్లోని డెమ్చోక్లో రెండు దేశాల బలగాలు.. సహకార పద్థతిలో పెట్రోలింగ్ (Coordinated Patrolling)నిర్వహిస్తున్నాయి. భారతీయ ఆర్మీ వర్గాలు ఈ విషయాన్ని శుక్రవారం పేర్కొన్నాయి. త్వరలో దేప్సాంగ్ వద్ద కూడా కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈస్ట్రన్ లడాక్లోని రెండు ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైంది. 2020 మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తంగా ఉన్న అన్ని ప్రదేశాల నుంచి ప్రస్తుతం బలగాల ఉపసంహరణ జరిగినట్లు పేర్కొన్నారు.