Sunil Gavaskar : జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ ఒక్కటే కాదు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. కొన్నిసార్లు ప్రతిభావంతులు కూడా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన జట్టులో చోటు కోల్పోయిన సందర్భాలు చాలానే. అయితే.. ఫిట్‌గా లేకున్నా సరే మైదానంలో శతకాల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. బెంగళూరు టెస్టులో అతడి 150 పరుగుల ఇన్నింగ్స్ చూసినవాళ్లంతా ఫిట్నెస్ ఒక్కటే కాదు ప్రతిభ కూడా కొలమానమే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar ) ఫిట్నెస్ టెస్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అందుకు కఠినమైన ‘యో – యో’ (Yo- Yo) టెస్టు ఓ కారణం అని తెలిసిందే. అందుకని ఇకనైనా క్రికెటర్లకు యోయో టెస్టులు నిర్వహించకండి అని గవాస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి విన్నవించాడు. యో – యో టెస్టుల పేరుతో ఆటగాళ్ల ఫిట్నెస్ను అంచనా వేయకండి. ఈ పరీక్షలకు బదులు వాళ్లు మానసికంగా ఎంత బలంగా ఉన్నారో తెలుసుకోండి అని గవాస్కర్ తెలిపాడు.
అంతేకాదు ఓ క్రికెటర్ సత్తువను, ఫిట్నెస్ను పక్కాగా అంచనా వేసేందుకు ఈ పద్ధతి చాలా మంచిదని భారత లెజెండ్ వెల్లడించాడు.’ దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ పరుగుల వరద పారించాడు. అయినా సరే అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అందుకు భారత సెలెక్టర్ల బుర్రలో తిరిగే ఫిట్నెస్ ఆలోచనలే కారణం. భారతీయుల్లో చాలామంది సన్నని నడుము ఉండదుగా’ అని గవాస్కర్ యోయో టెస్టు రద్దు ఎంత ముఖ్యమో వివరించాడు.
ప్రతి సిరీస్‌కు లేదా విదేశీ పర్యటనలకు జట్టు ఎంపిక ముందు భారత ఆటగాళ్లకు యో యో టెస్టు తప్పనిసరి. ఆ పరీక్షలో గట్టెక్కితేనే జట్టులో చోటు దక్కుతుంది. అందుకని క్రికెటర్లు యో యో టెస్టు అంటేనే ‘వామ్మో.. లైట్ తీస్కోవద్దురా బాబూ’ అని అనుకుంటారు. ప్రస్తుతం టీమిండియాలో అత్యంత ఫిట్నెస్ గల ఆటగాడు ఎవరంటే.. విరాట్ కోహ్లీ (Virat Kohli). యువకెరటం శుభ్‌మన్ గిల్ సైతం ఈ మధ్య ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాడు.
యో యో పరీక్షలో భారత క్రికెటర్లు